Priyamani: తన భర్త మొదటి భార్య ఆయేషాకు గ‌ట్టి కౌంట‌ర్‌ ఇచ్చిన ప్రియమణి..!

  • July 23, 2021 / 07:22 PM IST

ప్రియమణి భర్త ముస్త‌ఫారాజ్ మొద‌టి భార్య అయిన ఆయేషా ఇటీవల పాల్గొన్న ఓ ఇంట‌ర్వ్యూలో ప్రియ‌మ‌ణి,ముస్త‌ఫారాజ్ లు చేసుకున్న పెళ్లి చెల్లదు అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ‘నాకు విడాకులు ఇవ్వ‌కుండా వాళ్లిద్ద‌రు పెళ్లి చేసుకోవ‌డం సరైనది కాదు. అందుకే ఈ విషయం పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాను.ముస్త‌ఫారాజ్, నేను ఇప్పటికీ విడాకులకు అప్లై చేయలేదు.ఎన్నో ఏళ్ళుగా ఈ విషయాన్ని బయటపెట్టాలని అనుకున్నాను కానీ ఇద్దరు పిల్లల తల్లిగా అలోచించి పెదవి విప్పలేకపోయాను. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఈ విషయం పై ముస్తఫా స్పందించి సీరియ‌స్‌ అయ్యారు. ఆయేషా అన్నీ అబ‌ద్ధాలు చెబుతుంది. ఆమె నుండీ విడిపోయిన రోజు నుండీ పిల్లల సంరక్షణ నేనే చూసుకుంటున్న‌ట్టు ఆయన తెలిపాడు.నా నుండీ మ‌రింత డ‌బ్బు ఆశించడం కోసమే ఆమె ఈ ఆరోప‌ణ‌లు చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం పై ముస్తఫారాజ్ రెండో భార్య అయిన ప్రియమణి స్పందించి అయేషాకి గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘మా మ‌ధ్య అనుబంధం ఎన్నటికీ చెరిగిపోదు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే. ముస్తఫారాజ్‌తో నా వైవాహిక‌ జీవితం చాలా బాగుంది. ముస్తఫాకి కూడా నేనంటే చాలా ఇష్టం.

‘ఏ బంధం బ‌ల‌ప‌డాలన్నా ….వాళ్లిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం ప్రేమ‌గా మాట్లాడుకోవాలి. ముస్తఫా, నాకు మధ్య అలాంటి బంధం ఉంది.బిజినెస్ పనుల వల్ల ముస్తఫా అమెరికా వెళ్లారు.ఆయన ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ సాయంత్రం నాకు వీడియో కాల్‌ చేసి మాట్లాడతారు. నేను కూడా అంతే… షూటింగ్ లో బిజీగా ఉన్నా ముస్త‌ఫా కోసం టైం కేటాయిస్తా అని చెప్పారు. మేము వివాహం చేసుకుని 4 ఏళ్ళు పూర్తి కావస్తోంది.2017 లో మేము వివాహం చేసుకున్నప్పుడు ముస్తఫా ఆమెను కలిసి ఈ విషయం చెప్పాడు.అంతకు ముందే చాలా సార్లు ఆమెను విడాకులు కావాలని కోరాడు. దానిని ఆమె సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు ఇంత ఇష్యు చేస్తున్నది తెలీడం లేదు” అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus