Priyanka Arul Mohan: ప్రియాంక అరుళ్ మోహ‌న్.. ఇక గట్టెక్కినట్టే..!

  • October 14, 2021 / 10:43 AM IST

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్`తో హీరోయిన్ గా పరిచయమైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్. సినిమా విడుదల టైములో ఈ భామకి మంచి క్రేజ్ ఏర్పడింది. విక్రమ్ కుమార్ సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారు… అదే విధంగా వారి నటనతో కూడా మెప్పిస్తుంటారు. విక్రమ్ కుమార్ కూడా హీరోయిన్ల పాత్రలకు చాలా ప్రాముఖ్యతని ఇస్తుంటాడు. అయితే ప్రియాంక కూడా నటన పరంగా మెప్పించినా..

సినిమా సక్సెస్ సాధించకపోవడంతో వెనుకబడిపోయింది. శ‌ర్వానంద్ తో చేసిన `శ్రీ‌కారం` కూడా సేమ్ రిజల్ట్ ఇవ్వడంతో ఈమె కెరీర్ అయోమయంలో పడినట్టు అయ్యింది. అయితే ఎట్టకేలకు ఈ అమ్మడు ఓ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. నెల్స‌న్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీలో ఈమె హీరోయిన్ గా నటించింది.’గ్యాంగ్ లీడర్ సినిమాలో చేసిన పాత్ర లాంటి పాత్రనే ఈ సినిమాలో కూడా చేసింది ప్రియాంక.

అయితే ఈసారి టార్గెట్ మిస్ అవ్వలేదు. ఆమె పాత్రకి కొంచెం కామెడీ కూడా జోడించడంతో ప్రేక్షకులు ప్రియాంక రోల్ ను బాగా ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 9న విడుద‌లైన ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో ప్రియాంక కి మరిన్ని మంచి అవకాశాలు రావడం అని ఇండస్ట్రీ కోడై కూస్తోంది.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus