‘వారణాసి’ సినిమా గురించి ఇప్పటివరకు అధికారికంగా బయటకు వచ్చిన సమాచారం అంటే.. అది ఆ రోజు ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్లో రాజమౌళి చెప్పింది. ఆ తర్వాత అంతర్జాతీయ మీడియాకు సినిమా టీమ్ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. అందులో అక్కడక్కడా కొన్ని పాయింట్లు చెప్పారు. వాటిలో ఎలివేషన్లు ఎక్కువ, ఇన్ఫర్మేషన్లు తక్కువ అని టాక్. అయితే, ఇప్పుడు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఓ విషయం చెప్పుకొచ్చింది. ఆమె మాటలతో కొంత క్లారిటీ వచ్చినా.. ఇంకొంత డౌట్స్ ఉండిపోయాయి అని చెప్పొచ్చు.
సినిమా గ్లింప్స్ చూసిన తర్వాత అందరూ చెప్పే మాట, రాజమౌళి కూడా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిన మాట. ఈ సినిమా వివిధ కాలమాన పరిస్థితుల్లో ఉంటుంది అని అంటే ఎప్పుడో BC కాలం నుండి ఫ్యూచర్‌లోకి వెళ్తుంది అని. అయితే పాత రోజులకు ఎందుకు వెళ్లారు, ఏం చూపించారు. రాబోయే రోజులకు ఎందుకు వెళ్తారు, ఏం చూపిస్తారు అనేదే ఇక్కడ పాయింట్ అని గ్లింప్స్, అందులోని డేట్స్ చూస్తే అర్థమైంది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఇంచుమించు ఇదే మాట చెప్పింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉంటుందని, కానీ టైమ్ ట్రావెలర్ సినిమా కాదు అని అంటోంది.
అంటే వివిధ కాలాలను సినిమాలో చూపిస్తారు కానీ.. టైమ్ మెషీన్, అందులో ప్రయాణం లాంటివి ఏవీ ఉండవు అనేది ఆమె మాట. కచ్చితంగా ఆమె మాటల్లో చెప్పాలంఏ.. 7200 BCE నుండి 2027 మధ్యలో జరిగే కథ ఇది. వివిధ కాలాలు, ప్రపంచాల్లో సినిమాలోని ప్రధాన పాత్రలు కనిపిస్తాయి. అదెందుకు అనేదే సినిమా అని చెప్పింది. ఆమె మాటల ప్రకారం అయితే ఒకే వ్యక్తి మూడు జన్మలు లేదంటే మూడు పరిస్థితుల్ని ఎలా జీవించాడు అనేదే కథ అవ్వొచ్చు.
అయితే, ఈ సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనిపిస్తాడు అనేది ఫిక్స్. ఒక రుద్ర అనే బౌంటీ హంటర్, రెండోది రాముడి పాత్ర. అయితే ప్రపంచాన్నిచుట్టొచ్చే వీరుడు అని సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో చెప్పారు. దీంతో హనుమంతుడి నేపథ్యమేమో అనుకున్నారంతా. మరి ఆ పాత్రను ఏమైనా సర్‌ప్రైజ్ కోసం ఎక్కడా చెప్పడం లేదా అనేది చూడాలి.