Priyanka Jain: బిగ్ బాస్ లో ఆ కంటెస్టెంట్ జెన్యూన్ కాదు.. ప్రియాంక కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్న కంటెస్టెంట్లలో ప్రియాంక జైన్ ఒకరు. బిగ్ బాస్ సీజన్7 కంటెస్టెంట్ అయిన ప్రియాంక తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఇంజక్షన్లు, పిల్స్ వాడానని ఆమె అన్నారు. హౌస్ లో ఉన్న సమయంలో నా పనులు నేను చేసుకోవడానికే ఇబ్బంది ఎదురైందని ఆమె తెలిపారు. ఆ సమయంలో వాళ్లకు పనులు చేసి పెట్టలేదని నన్ను హైలెట్ చేయడం జరిగిందని ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు.

ఆరోగ్య సమస్యల వల్ల రోటీలు దాచుకుంటే అది కూడా హైలెట్ చేశారని ఆమె పేర్కొన్నారు. నేను అలా చేయకపోతే స్పై బ్యాచ్ వాళ్లు రోటీలు తినేస్తారని ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు. తాను బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పాను కానీ బిగ్ బాస్ నిర్వాహకులు చూపించలేదని ఆమె అన్నారు. బిగ్ బాస్ హౌస్ లో నేను స్ట్రాటజీలు చేసి ఉంటే నేను టాప్ లో ఉండేదానినని ప్రియాంక జైన్ పేర్కొన్నారు.

నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు శివాజీ దగ్గర సమాధానం లేదని ఆమె చెప్పుకొచ్చారు. నేను అబద్ధాలు ఆడతానని శివాజీ కామెంట్ చేసేవారని శివాజీ జెన్యూన్ కాదని ఆయన మాస్టర్ మైండ్ తో గేమ్ ఆడారని ప్రియాంక జైన్ కామెంట్లు చేశారు. శివాజీ ఏంటో జనాలకు అర్థం కాలేదని ఆమె తెలిపారు. బిగ్ బాస్ షో కోసం నేను వెయ్యి శాతం ఇచ్చానని నేను చేసినవి చూపించి ఉంటే నేనే విన్నర్ అని ఆమె తెలిపారు.

బిగ్ బాస్ షోలో తాను కష్టపడ్డానని (Priyanka Jain) ప్రియాంక జైన్ చెప్పుకొచ్చారు. శివాజీ మాస్క్ తో ఉంటాడని ఆయన ఎన్ని రోజులైనా నటించగలడని ఆమె కామెంట్లు చేశారు. ప్రియాంక జైన్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. బిగ్ బాస్ షో ద్వారా ఆమెకు భారీ స్థాయిలోనే పారితోషికం దక్కిందని సమాచారం అందుతోంది. బిగ్ బాస్ షో ఓటీటీ వెర్షన్ ఆగిపోవడం అభిమానులకు షాకిస్తోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus