Priyanka Jawalkar: ఎర్ర చీరలో ఘాటైన అందాలు.. వైరల్ అవుతున్న ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోలు

2017లో వచ్చిన ‘కలవరమాయే మదిలో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్… 2018 లో వచ్చిన ‘టాక్సీవాలా’ చిత్రంతో పాపులర్ అయ్యింది. ఆ సినిమా హిట్ అయినా ఎందుకో ఈమెకు త్వరగా అవకాశాలు రాలేదు.తర్వాత కొవిడ్ వల్ల లాక్ డౌన్ కూడా ఏర్పడటంతో ఈమెకు చాలా గ్యాప్ వచ్చింది. 2021 లో ‘తిమ్మరుసు’ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ వంటి చిత్రాలతో మళ్ళీ హిట్లు అందుకుని ట్రాక్లోకి వచ్చింది. కానీ ‘గమనం’ తో మళ్ళీ బ్రేక్ లు పడ్డాయి. ఆ సినిమాలో ఈమె బాగా నటించినా..

సినిమా ఆడకపోవడంతో ఈమె కెరీర్ పై ప్రభావం పడింది. ఇదిలా ఉండగా.. ఒకప్పుడు ఈమె కొంచెం బొద్దుగా ఉండేది అన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో ఈమె పై ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే ఆ కామెంట్స్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని ఈమె ఎన్నో వర్కౌట్లు చేసి సన్నబడింది . ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఆఫర్లు లేవు. బాలయ్య నెక్స్ట్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టినట్టు ప్రచారం జరిగింది.

అది పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె తన వంతు కృషి చేస్తూనే ఉంది. నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేసి తన ఫాలోవర్స్ ను ఆకర్షిస్తుంది. తాజాగా రెడ్ కలర్ శారీలో నాజూకైన నడుము అందాలు ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె ఇన్స్టాఖాతాకి 1 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉండడంతో అవి హాట్ టాపిక్ అయ్యాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus