అనీల్ సుంకర లిస్ట్ లో మరో ప్లాప్!

  • January 27, 2021 / 08:59 AM IST

టాలీవుడ్ లో చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు కూడా తీస్తుంటారు నిర్మాత అనిల్ సుంకర. 14 రీల్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంటలతో కలిసి ‘దూకుడు’, ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ లాంటి భారీ చిత్రాలను నిర్మించారు. ఈ సినిమాలు చేస్తూనే ఏకే ఎంటర్టైన్మెంట్స్ పేరుతో సొంతంగా బ్యానర్ పెట్టి సినిమాలు తీయడం మొదలుపెట్టారు అనిల్ సుంకర. ఒకప్పుడు ఈ బ్యానర్ లో చేసిన సినిమాలు ఆడాయి. మధ్యలో గోపీనాథ్ తో విభేదాలు వచ్చి 14 రీల్స్ నుండి బయటకొచ్చేశారు అనిల్ సుంకర.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బేనర్లోనే సినిమాలు తీస్తున్నారు. గతేడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో అనిల్ కూడా భాగస్వామి అనే సంగతి తెలిసిందే. చిన్న హీరోలను నమ్ముకొని ఆయన తీస్తున్న సినిమాలు మాత్రం నిరాశనే మిగిలుస్తున్నాయి. ఫామ్ లో ఉన్న యంగ్ హీరోలను నమ్మి వారితో ఒప్పందాలు చేసుకొని వరుసగా సినిమాలు తీస్తున్నారు అనిల్ సుంకర. గతంలో రాజ్ తరుణ్ వరుస హిట్లు అందుకుంటున్న సమయంలో అతడితో అగ్రిమెంట్ చేసుకొని ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘అంధగాడు’, ‘రాజు గాడు’ సినిమాలు తీశారు.

కానీ ఇవేవీ కూడా ఆడలేదు. ఇక అల్లరి నరేష్ తో తీసిన ‘యాక్షన్ 3డీ’, ‘జేమ్స్ బాండ్’, ‘సెల్ఫీ రాజా’ సినిమా డిజాస్టర్లుగా మిగిలాయి. నరేష్ ఫామ్ లో లేడని తెలిసి కూడా అతడితో ‘బంగారు బుల్లోడు’ అనే తీశాడు అనిల్ సుంకర. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో తెలిసిందే. ఇలా వరుసగా కుర్ర హీరోలను నమ్ముకొని నష్టాలపాలవుతున్నాడు అనిల్ సుంకర.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus