Chitti Babu: సమంతపై మళ్లీ ఫైర్ అయిన నిర్మాత చిట్టిబాబు.. అలా విమర్శిస్తూ?

కొన్నిరోజుల క్రితం సమంత నిర్మాత చిట్టిబాబు గురించి వ్యంగ్యంగా సెటైర్లు వేసినట్టు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సమంత ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో లేకపోయినా ఆ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ కావడం జరిగింది. అయితే ఆ కామెంట్లు తన దృష్టికి రావడంతో తాజాగా చిట్టిబాబు ఆ కామెంట్ల గురించి స్పందించడం జరిగింది. నేను కౌంటర్ వేస్తే సమంతకు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదని ఆయన అన్నారు.

సమంత నా పేరు ప్రస్తావించలేదు కాబట్టి నేను కూడా సమంత పేరుతో సమాధానం ఇవ్వడం లేదని చిట్టిబాబు పేర్కొన్నారు. కానీ నేను కౌంటర్ ఇస్తే మాత్రం సమంత నుంచి జవాబు రాదని ఆయన వెల్లడించారు. నా వెంట్రుకల గురించి మాట్లాడటానికి బదులుగా సమంత నా కామెంట్లలో ఉన్న నిజాయితీ గురించి మాట్లాడి ఉంటే బాగుండేదని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.

చిట్టిబాబు (Chitti Babu) కామెంట్ల గురించి సమంత మళ్లీ రియాక్ట్ అవుతారో లేదో చూడాల్సి ఉంది. సమంత చిట్టిబాబు కామెంట్ల గురించి స్పందిస్తే మాత్రం చిట్టిబాబు రేంజ్ పెరుగుతుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత అనవసర విషయాలపై దృష్టి పెట్టకుండా కెరీర్ పై దృష్టి పెడితే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలా ఉన్నా విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారని సమంత ఫ్యాన్స్ చెబుతున్నారు.

సమంత ఖుషి, సిటాడెల్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా ఈ రెండు ప్రాజెక్ట్ లలో ఒకటి సక్సెస్ సాధించినా మరికొన్ని సంవత్సరాల పాటు సమంత కెరీర్ కు ఢోకా ఉండదని చెప్పవచ్చు. 5 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్న సమంత స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే మాత్రం కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి. సమంతకు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా సినిమా ఆఫర్లు అయితే వస్తున్నాయని సమాచారం.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus