Project K: ‘ప్రాజెక్టు కె’ నుండి అమితాబ్ పాత్ర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

  • October 12, 2022 / 11:56 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా సినిమాల్లో ‘ప్రాజెక్టు కె’ ఒకటి.’ఎవడే సుబ్రహ్మణ్యం’ ‘మహానటి’ వంటి రెండు మిడ్ రేంజ్ సినిమాలను తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వైజ‌యంతీ మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రభాస్ కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా ఓ కీల‌క‌ పాత్ర పోషిస్తున్నాడు.ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అమితాబ్ పాత్రకు సంబంధించిన ఓ లుక్ పోస్టర్ ను వదిలారు. ఇందులో అమితాబ్ కనబడలేదు కానీ ఆయన చెయ్యి… చేతికి ఓ కట్టు కనిపిస్తుంది.అలాగే ఈ పోస్టర్ లో ‘లెజెండ్స్ ఆర్ ఇమ్మోర్టల్’ అని రాసి ఉంది. అంటే ‘గొప్పవాళ్లకు చావే ఉండదు’ వాళ్ళు అమరులు అని అర్ధం వచ్చేలా ఉంది. ఈ చిత్రంలో అమితాబ్ పాత్ర ఇదేనంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

‘ప్రాజెక్ట్ కె’ లో బిగ్ బి.. అశ్వ‌ద్ధామ‌ పాత్రని పోషిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. పురాణాల గురించి తెలిసిన వారికి ఈ పాత్ర గురించి తెలిసే ఉంటుంది.చావే లేని వాళ్ళుగా ఆంజ‌నేయుడు, అశ్వ‌ద్ధామ ల పేర్లు కొందరు పండితులు చెబుతుంటారు. ఇప్పటికీ వీళ్ళు బ్రతికే ఉన్నారు అనేది కొంతమంది న‌మ్మ‌కం. ఆంజ‌నేయుడు ఇంకా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అశ్వ‌ద్ధామ కూడా బ్రతికి ఉంటే ఎలా ఉంటుంది..? అనే థీమ్ తో అమితాబ్…

అశ్వద్ధామ పాత్రని దర్శకుడు నాగ్ అశ్విన్ డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.ఇలాంటి పురాణ పాత్ర‌ల ఇందులో ఇంకా ఉన్నాయట.చెప్పుకోవడానికి అమితాబ్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది. తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్ తో ఈ విషయం నిజమే అని స్పష్టమవుతుంది. అలాగే హీరో ప్రభాస్ కూడా సూపర్ నేచురల్ పవర్స్ కలిగిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని టాక్ నడుస్తుంది. అతని లుక్ కు సంబంధించిన పోస్టర్ వస్తేనే కానీ అది నిజమని చెప్పలేం.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus