‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్!

  • October 30, 2020 / 05:45 PM IST

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాళం పేరు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మార్మ్రోగిపోతోంది. దానికి కారణం ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ లనే చెప్పాలి. తన చేతికి ఉంగరం ఉన్న ఫోటోని చేస్తూ ఎంగేజ్మెంట్ అయిపోయిందని ఫీలింగ్ ను కలిగించింది. ఆ తరువాత ఏకంగా తనకు కాబోయే వాడిని పరిచయం చేస్తూ.. ‘ఉద్భవ్ నేను కలిసి రేపు బిగ్ డే గురించి మీకు చెప్తాను’ అంటూ మరో పోస్ట్ పెట్టింది. దీంతో వీరిద్దరికీ పెళ్లి ఫిక్స్ అయిందని అనుకున్నారు.

కానీ అందులో నిజం లేదని.. ఇదంతా ప్రమోషన్స్ లో భాగమేనని తేలిపోయింది. తాజాగా పునర్నవి సోషల్ మీడియా వేదికగా తాను నటించబోయే వెబ్ సిరీస్ గురించి ప్రకటించింది. ‘కమిట్ మెంటల్’ అనే పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఇకముందు ఉంది అసలైన క్రేజీ రైడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘కమిట్ మెంటల్’ సిరీస్ ‘పర్మనంట్ రూమ్ మేట్స్’ అనే హిందీ వెబ్ సిరీస్ కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ మీడియా ప్రొడక్షన్ హౌస్ తమడా నిర్మాణ భాగస్వామ్యంలో ‘ఆహా’ కోసం రూపొందుతున్న ఈ సిరీస్ కి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే పునర్నవి ఎంగేజ్మెంట్, పెళ్లి అంటూ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేసింది. ఈ సిరీస్ ‘ఆహా’ యాప్ లో నవంబర్ 13 నుంచి ప్రసారం కానుంది.

1

2

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus