పంజాబీ అమ్మాయిలంటే తెలుగు సినీ ప్రేక్షకులకు చాలా అభిమానం. పంజాబ్ లో పుట్టి పెరిగిన భూమిక, ఛార్మి కౌర్. రకుల్ ప్రీత్ సింగ్ లకు టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయిని అందించారు. “మొదటి సినిమా” తో ఆకట్టుకున్న పూనమ్ బజ్వా, ఆటాడుకుందాంరా అంటూ సోనమ్ బజ్వా తెలుగు ఆడియన్స్ ని అలరించారు. గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో నటించిన యామి గౌతమ్ కూడా పంజాబీ పిల్లనే. ఇక “కృష్ణగాడి వీరప్రేమగాథ”తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ కౌర్ కూడా పంజాబీ అమ్మాయే. మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో ఆకట్టుకున్న ఈ భామ చేతినిండా సినిమాల్తో బిజీగా ఉంది.
అందుకే మన దర్శకులు ఏరికోరి పంజాబీ అమ్మాయిలను తీసుకొస్తున్నారు. తాజాగా మరో పంజాబీ భామ టాలీవుడ్ కి పరిచయం కాబోతోంది. పంజాబీ మోడల్ అయిన హీరా సోహల్, శ్రీధర్ సీపనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ద్వారా తెలుగు వారి ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “నా మోడలింగ్ అసైన్‌మెంట్ చేశాక డైరెక్టర్ నన్ను ఆడిషన్‌కు పిలిచారు. నేను పంజాబీని కాబట్టి నాకు తెలుగు తెలియదు. నేను నా ఆడిషన్‌ని హిందీలో కంప్లీట్ చేశాను. డైరెక్టర్ నా యాక్టింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, లుక్ టెస్ట్ తర్వాత నన్ను సెలక్ట్ చేశారు” అని చెప్పుకొచ్చింది. మరీ ఈ భామ ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.