పవన్ కళ్యాణ్ తో కాదు… చిరంజీవితో పూరి సినిమా ఫిక్స్?

  • April 3, 2020 / 04:02 PM IST

గతకొంత కాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. పూరి డ్రీం ప్రాజెక్ట్ అయిన ‘జన గణ మన’ నే పవన్ తో తెరకెక్కించే విధంగా ప్లాన్ చేసాడు పూరి. ఈ చిత్రంలో పవన్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు అని కూడా టాక్ వినిపించింది. తక్కువ టైంలోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తాడు కాబట్టి పవన్ కూడా ఓకే చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు చిరంజీవి తో కూడా పూరి ఓ సినిమాని తెరకెక్కిస్తాడు అనే వార్తలు కూడా ప్రచారంలో ఉంది. దీంతో పవన్ తో పూరి సినిమా లేనట్టేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ సినిమా పూర్థయ్యకే పూరీతో సినిమా ఉంటుందని కూడా ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం. ఇక విజయ్ దేవరకొండ తో సినిమా పూర్తయ్యాక పూరి ఖాళీనే..!

దీంతో ‘లూసీఫర్’ రీమేక్ ను పూరి డైరెక్షన్లో చేయించాలి అని చిరు, చరణ్ లు భావిస్తున్నారట. ఎలాగు పూరీకి కూడా చిరుతో సినిమా చెయ్యాలని ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాడు. నిజానికి చిరు 150 వ సినిమా పూరి డైరెక్షన్ లొనే చెయ్యాలి కానీ కుదర్లేదు. ఈసారి ఆ ముచ్చట తీరబోతుందన్న మాట. అలా అని పూరి -పవన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఏమీ లేవన్నట్టు కూడా తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus