Puri Jagannadh: సక్సెస్ దక్కాలంటే పూరీ అలా చేయాల్సిందేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ కొన్నేళ్ల క్రితం వరకు వరుస సక్సెస్ లతో కెరీర్ ను కొనసాగించారు. అయితే ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడం లేదు. లైగర్ సినిమా పూరీ జగన్నాథ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలవడం గమనార్హం. అయితే పూరీ జగన్నాథ్ రెండు విషయాలలో కచ్చితంగా మారాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పూరీ జగన్నాథ్ బలమైన కథ, కథనం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్టార్ హీరోలకు అనుగుణంగా కథలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే సమయంలో పూరీ జగన్నాథ్ పరిమిత బడ్జెట్ తోనే సినిమాలను తెరకెక్కించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల వల్ల పూరీ జగన్నాథ్ భారీ మొత్తంలో నష్టపోతుండటం గమనార్హం. పూరీ జగన్నాథ్ సినిమాలతోనే చాలామంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమై, స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

పూరీ జగన్నాథ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై పెద్దగా అంచనాలు లేవు. పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి వస్తే మాత్రమే స్టార్ హీరోలు ఆయనను నమ్మే అవకాశం ఉంది. లైగర్ సినిమా ఫ్లాప్ వల్ల పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమన ఆగిపోయింది. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ఇతర నిర్మాతల సినిమాలకు 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

పూరీ జగన్నాథ్ సినీ నిర్మాణానికి దూరంగా ఉండాలని మరి కొందరు కోరుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా పూరీ జగన్నాథ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus