అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమా తీసుకున్న బడ్జెట్ గణనీయంగా పెరిగినట్లు సమాచారం. పుష్ప మొదటి భాగం విజయం తర్వాత ఈ సీక్వెల్ పట్ల ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, నటీనటులకు భారీ పారితోషికాలు అందజేసినట్లు టాక్. అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సారి తన రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకున్నట్లు సమాచారం.
న్యూ డీల్ ద్వారా బన్నీకి దాదాపు రూ. 270 నుంచి రూ. 280 కోట్ల వరకు అందిందని సినీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. పుష్ప 1 (Pushpa) ప్రభావంతో బన్నీ పేరు పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. చివరగా అల.. వైకుంఠపురములో (Ala Vaikunthapurramuloo) సినిమాకు 35 కోట్ల కంటే తక్కువే తీసుకున్న బన్నీ ఈసారి ఊహించని స్థాయిలో 250 కోట్లకు పైగా అందుకోవడం రికార్డ్ అనే చెప్పాలి. ఇక దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ సారి దర్శకుడిగా మాత్రమే కాకుండా సహనిర్మాతగా కూడా వ్యవహరించారు.
పారితోషికంగా రూ. 100 కోట్లకు పైగా తీసుకున్న ఆయన, సినిమా లాభాల్లో భాగస్వామ్యాన్ని కూడా పొందినట్లు తెలుస్తోంది. ఇదే దర్శకుడికి అత్యధిక రెమ్యునరేషన్‌గా భావిస్తున్నారు. హీరోయిన్ రష్మిక మందన్నకు (Rashmika Mandanna) ఈసారి రూ. 10 కోట్లు అందించినట్లు సమాచారం. విలన్‌గా చాప్టర్ 2లో కీలకమైన పాత్ర పోషించిన ఫాహద్ ఫాజిల్‌కు (Fahadh Faasil) రూ. 8 కోట్లు చెల్లించారని టాక్. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) రూ. 5 కోట్లకు పైగా తీసుకున్నట్లు చెబుతున్నారు. స్పెషల్ సాంగ్‌లో నర్తించిన శ్రీలీలకు (Sreeleela) రూ. 2 కోట్లు పారితోషికం అందిందని సమాచారం.
ఇక సపోర్టింగ్ రోల్స్ లో నటించిన జగపతిబాబు (Jagapathi Babu), అనసూయ (Anasuya Bhardhwaj), రావు రమేశ్(Rao Ramesh) తదితర నటీనటులకు కూడా భారీగా పారితోషికాలు చెల్లించారని టాక్. మొత్తం సినిమా బడ్జెట్ రూ. 600 కోట్ల వరకు చేరిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో సగం వరకు పారితోషికాలకే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 (Pushpa 2) ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారా రూ. 1000 కోట్ల టార్గెట్‌ను చేరుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు థియేట్రికల్ వసూళ్లు ఈ రికార్డులను మరో మెట్టుపైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.