Pushpa 3: పుష్ప పార్ట్ 3 టైటిల్ సెట్ చేసిన సుకుమార్!

మరికొన్ని గంటల్లో పుష్ప 2 (Pushpa 2: The Rule) ప్రీమియర్ షోస్ మొదలవ్వనున్నాయి. దేశం మొత్తం “పుష్ప 2” కోసం వెయిట్ చేస్తోంది. ఆల్రెడీ 10 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని టీమ్ ఎనౌన్స్ చేసింది. మొదటిరోజే ఈ చిత్రం 300 కోట్ల రూపాయల దాకా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పుష్ప2 కి సీక్వెల్ గా “పుష్ప 3” (Pushpa 3) ఉంటుందా లేదా అనే విషయంలో ఇప్పటివరకు మీమాంస ఉండింది. మొన్న చెర్రీ స్టేజ్ మీద పుష్ప3 ఉంటుంది అని కన్ఫర్మ్ చేసినా నిజం అయ్యుండదులే అనుకున్నారు జనాలు.

Pushpa 3

కట్ చేస్తే.. ఇవాళ సినిమాకి సౌండ్ మిక్సింగ్ వర్క్ చేసిన రెసూల్ పూకుట్టి వర్క్ కంప్లీట్ అయ్యిందంటూ పోస్ట్ చేసిన ఫోటో పార్ట్ 3 ని కన్ఫర్మ్ చేసాయి. పుష్ప పార్ట్ 1 – ది రైజ్(Pushpa) , పుష్ప పార్ట్ 2- ది రూల్, ఇప్పుడు పుష్ప పార్ట్ 3 – ది ర్యాంపేజ్ (Pushpa 3) అనే టైటిల్ కార్డ్ దర్శనమిచ్చేసరికి అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు.

అయితే.. ఈ పార్ట్ 3 సెట్స్ మీదకు వెళ్ళడానికి కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే బన్నీ ఇమ్మీడియట్ గా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో సినిమా పూర్తి చేసుకొని ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సినిమా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కానీ సుకుమార్ కి పార్ట్ 3 – ర్యాంపేజ్ కోసం డేట్స్ ఇవ్వలేడు.

ఈలోపు సుకుమార్ కూడా రామ్ చరణ్ తో (Ram Charan) ఎనౌన్స్ చేసిన సినిమా కంప్లీట్ చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంటాడని తెలుస్తోంది. ఏదేమైనా రిలీజ్ కి ఒకరోజు ముందే పార్ట్ 3 కూడా ఉంటుంది అనే విషయం సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. మరి పార్ట్ 3 కి సంబంధించి గ్లింప్స్ కానీ హుక్ పాయింట్ కానీ సుకుమార్ ఏమైనా వదిలాడా లేదా అనేది మాత్రం ప్రీమియర్ షోస్ పూర్తయ్యాక తెలుస్తుంది.

ఫస్ట్ డే రికార్డుల కోసం కొత్త వ్యూహాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus