Pushpa 2: పుష్ప 2: అక్కడ మాత్రం 17 కోట్లు పాయే..!

Advertisement

అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2: ది రూల్ (Pushpa 2: The Rule) ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల భారీ వసూళ్లను అందుకుని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో ఏకంగా 800 కోట్లు రాబట్టి నార్త్ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ తమిళనాడు మార్కెట్ మాత్రం ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ చూపలేదు. తమిళనాడులో సినిమా భారీ అంచనాలతో విడుదలై, మొదటి రోజుల్లో పాజిటివ్ ఓపెనింగ్స్ సాధించినా, లాంగ్ రన్‌లో వసూళ్లు తక్కువగా ఉండిపోయాయి.

Pushpa 2

ఈ చిత్రం తమిళనాడులో మొత్తం 52 కోట్ల బిజినెస్ టార్గెట్‌తో విడుదలైంది. కానీ చివరికి కేవలం 34.86 కోట్ల షేర్ మాత్రమే రాబట్టగలిగింది. గ్రాస్ లెక్కలో ఈ చిత్రం 80.50 కోట్లు రాబట్టినా, బయ్యర్లు 17 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇక కేరళలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అక్కడ సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, వసూళ్లు స్థిరంగా కొనసాగలేదు. సాధారణంగా కేరళలో అల్లు అర్జున్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది.

కానీ ఈసారి ఈ రెండు ప్రాంతాల్లో సినిమాకు అంచనాల స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కేరళలో కూడా బయ్యర్లు కొంత నష్టాన్ని చూసినట్లు సమాచారం. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మరియు నార్త్ ఇండియా మార్కెట్‌లో సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. నైజాం, ఆంధ్రా, హిందీ మార్కెట్‌లలో వచ్చిన రెస్పాన్స్ ఈ రెండుచోట్ల వచ్చిన నష్టాలను సులభంగా కవర్ చేసింది.

ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పుష్ప 2 మాస్ ఎలిమెంట్స్, సుకుమార్ (Sukumar) దర్శకత్వం అల్లు అర్జున్ నటన సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. తమిళనాడు, కేరళ మార్కెట్‌లో నష్టాలు వచ్చినప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా ఎలా ఉండాలో చూపించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news