రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ వద్ద చోటుచేసుకున్న హత్యా కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో బాధితురాలు వెంకట మాధవిని, ఆమె భర్త గురుమూర్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే హత్య తర్వాత తన భర్త పోలీసుల విచారణలో అతను చెప్పిన విషయాలు కలకలం రేపుతున్నాయి. మలయాళ థ్రిల్లర్ సినిమా ‘సూక్ష్మదర్శిని’ను చూసి తాను ప్రేరణ పొందానని గురుమూర్తి చెప్పడం అందర్నీ షాక్‌కు గురి చేసింది.
గురుమూర్తి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. తర్వాత వాటిని వేడి నీటిలో ఉడికించి, కొన్ని రసాయనాలు ఉపయోగించి మృతదేహం స్మెల్ బయటికి రాకుండా చూశాడు. ఈ పని చేయడానికి అతడికి ‘సూక్ష్మదర్శిని’ (Sookshmadarshini) అనే సినిమానే ప్రేరణగా నిలిచిందని విచారణలో తెలినట్లు తెలుస్తోంది. సూక్ష్మదర్శిని సినిమా తరహాలో కాకపోయినా దాదాపు గురుమూర్తి చేసిన హత్య అదే తరహాలో ఉండడంతో ఘటన మరింత వివాదాస్పదంగా మార్చింది.
‘సూక్ష్మదర్శిని’ (Sookshmadarshini) కథలో దత్తత తీసుకున్న కూతురిని కుమారుడు తల్లి కలిసి హత్య చేస్తారు. అనంతరం డెడ్ బాడీని మాయం చేసేందుకు శరీర భాగాలను ట్యాంక్ లో వేసి కెమికల్స్ తో కరిగిస్తారు. అనంతరం వాష్ రూమ్ ఫ్లష్ తో నీళ్ళను వదిలేస్తారు. ఇక దాదాపు అదే తరహాలో గురుమూర్తి భార్యను హమార్చిన విధానం అందరిని షాక్ కు గురి చేసింది. వేరే మహిళతో సంభందం పెట్టుకోని భార్య అడ్డు తొలగించేందుకు హత్య చేసినట్లు అతను ఒప్పుకున్నాడు.
ఇక సూక్ష్మదర్శిని జనవరి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఇది థియేటర్లలో ఘన విజయాన్ని సాధించడమే కాకుండా, ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కథానాయకులు బేసిల్ జోసెఫ్ (Basil Joseph), నజ్రియా నాజిమ్ (Nazriya Nazim) తమ నటనతో సినిమాను మరింత బలపరిచారు. ఈ ఘటనతో సినిమా ప్రభావం ఎంతటిదో, అది వాస్తవాన్ని ఎంతమేరకు ప్రేరేపిస్తుందో అన్నదానిపై కొత్తగా చర్చలు మొదలయ్యాయి.