పెళ్ళైన ఏడాదికే మళ్ళీ పెళ్లి.. హీరోయిన్ పోస్ట్ వైరల్!

హీరోయిన్ రెండోసారి పెళ్లి చేసుకుంది. మీరు చదువుతున్నది నిజమే.. అలా అని కంగారు పడకండి. ఆ హీరోయిన్ రెండోసారి పెళ్లి చేసుకుంది కూడా తన భర్తనే. మలయాళం హీరోయిన్ సాస్విక విజయ్ (Swasika).. ‘వైగై’ సినిమాతో పాపులర్ అయ్యింది. అటు తర్వాత పలు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ‘లబ్బర్ పందు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోలలో కూడా సందడి చేసింది.

Swasika

ఇదే క్రమంలో ప్రేమ్ అనే వ్యక్తిని పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుంది. 2024 జనవరి 26న ఈమె వివాహం జరిగింది. ఇప్పుడు ఆమె మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే.. సాస్విక తన భర్త ప్రేమ్ ను రెండోసారి వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ పెళ్లిరోజు నాడు అంటే జనవరి 26న ఈ జంట రెండోసారి పెళ్లి చేసుకుంది. ఈసారి తమిళ సంప్రదాయం ప్రకారం వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ హీరోయిన్ సాస్విక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. “చూస్తూ చూస్తూ ఏడాది అయిపోయింది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా తమిళ సంప్రదాయం ప్రకారం మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో మా వివాహం జరిగింది. అందుకు సహకరించిన వారందరికీ థాంక్స్. ఇది నిజమైన పెళ్లిలా, అందంగా, అద్భుతంగా జరిగింది” అంటూ సాస్విక రాసుకొచ్చింది. అలాగే ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది.

టాలీవుడ్ ఆఫర్స్.. అమితాబ్ రెమ్యునరేషన్ ఎంత?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus