మరో రెండు వారాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ అయినప్పటికీ.. డిసెంబర్ 4 నుండే ప్రీమియర్స్ పడుతున్నాయి. రిలీజ్ దగ్గర పడుతుంది. ప్రమోషనల్ డోస్ కూడా పెంచాలి. కానీ టీం ఆ దిశగా దృష్టి పెట్టడం లేదు అనిపిస్తుంది. ఇటీవల పాట్నాలో ట్రైలర్ లాంచ్ చేశారు. ఆ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయ్యింది. లక్ష మందికి పైగా ఆ ఈవెంట్ కి హాజరైనట్టు టీం చెబుతుంది.
నిర్మాతలు, దర్శకుడు ఇది చాలు అన్నట్టు కూర్చున్నారు. ‘ ‘పుష్ప'(Pushpa) వంటి పాన్ ఇండియా హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే.. ఆటోమేటిక్ గా జనాలే ప్రమోట్ చేసుకుంటారు’ అనే తీరులో పుష్ప దర్శక నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నిర్మాతల దృష్టంతా మొదటి రోజు సినిమాకి ఎంత లెక్క కట్టాలి అనే ఆలోచనలోనే ఉన్నారని సమాచారం. మొదటి రోజు ‘పుష్ప 2’ సినిమాకు రూ.300 కోట్లు ఆశిస్తున్నారట నిర్మాతలు.
అప్పుడే పోస్టర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్టు టాక్ నడుస్తుంది. వీకెండ్ కి రూ.600 కోట్ల గ్రాస్ పోస్టర్ ను కూడా రెడీ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ‘పుష్ప 2’ కి ఉన్న హైప్ ను బట్టి కచ్చితంగా మొదటి రోజు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. ఇప్పటివరకు మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) కొట్టింది. ఆ సినిమా మొదటి రోజు రూ.223 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
ఇప్పుడు ఆ రికార్డును క్రాస్ చేయాలని ‘పుష్ప 2’ అభిమానులు భావిస్తున్నారు. అందుకే వాళ్ళని డిజప్పాయింట్ చేయకుండా నిర్మాతలు నెంబర్ల పోస్టర్స్ తో రెడీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కలెక్షన్స్ పోస్టర్స్ కచ్చితంగా 30 శాతం మార్జిన్ తో ఎక్కువ నెంబర్లే ఉంటాయి. ‘పుష్ప 2’ కి ఉన్న హైప్ ను బట్టి కచ్చితంగా పెద్ద నెంబర్లు అయితే రిజిస్టర్ అవుతాయి.