Mechanic Rocky Trailer Review: షెపౌట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు!

విశ్వక్ సేన్  (Vishwak Sen) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా.. శ్రద్దా శ్రీనాథ్ (Shraddha Srinath)  కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky). రవి తేజ ముళ్ళపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రజని తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఆల్రెడీ ఓ ట్రైలర్ ను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో ట్రైలర్ ని విడుదల చేశారు.

Mechanic Rocky

‘మెకానిక్ రాకీ’ మొదటి ట్రైలర్లో హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్లు శ్రద్దా శ్రీనాథ్, మీనాక్షి చౌదరి..ల పాత్రలను పరిచయం చేశారు. మీనాక్షి చౌదరి పాత్ర వెంట పడుతూ హీరో చేసే కామెడీని హైలెట్ చేశారు. విలన్, హీరో పాత్రలను కూడా పరిచయం చేశారు. అయితే ఈ రెండో ట్రైలర్ లో.. కథలోని ఎమోషన్ ని చూపించారు. హీరో మెకానిక్ షాప్ స్థలం కోసం.. అతని తండ్రి విలన్ ను వేధించడం.. తర్వాత ఆ షెడ్డుని కూల్చివేయడం..

దాని కోసం హీరో విలన్ తో ఎలా ఫైట్ చేశాడు అనే పాయింట్ ను టచ్ చేస్తూ ట్రైలర్ ని కట్ చేశారు. విశ్వక్ సేన్ మార్క్ మాస్ డైలాగ్స్ ఇందులో ఉన్నాయి. ‘షెపౌట్ చేసుడే కాదు.. షేప్ సెట్ చేసుడు కూడా తెలుసు’ ‘బూట్ కాలుతో తంతే ఉత్త కాలు బయటకు వచ్చేస్తది’ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. విలన్ గా సునీల్ (Sunil) లుక్, అతని నటన కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

తెలుగు ఇంకో నాలుగు కాలాల పాటు చల్లగా బ్రతుకుతుందనిపిస్తుంది!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus