AR Rahman Divorce: రెహమాన్ కి విడాకులు ఇచ్చిన భార్య!

పాన్ ఇండియా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకున్నారు. 29 యేళ్ళ పాటు కలిసున్న ఈ జంట మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నట్టు తెలుస్తుంది. సైరా భాను తరఫు న్యాయవాది ఈ విషయాలు వెల్లడించారు. రెహమాన్ (AR Rahman) , సైరా భాను.. ల మధ్య ఏర్పడ్డ అగాధం ఇక తొలగడం కష్టమని భావించి వారు ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు ఆయన ఒక నోట్ విడుదల చేశారు.

AR Rahman Divorce

ఈ కష్ట కాలంలో సైరా భాను నిర్ణయాన్ని గౌరవించి తన ప్రైవసీకి సహకరించాలని ఆయన కోరారు. ఇక రెహమాన్ (AR Rahman) , సైరా భాను దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల కాలంలో బిగిల్ , అత్రంగి రే, దిల్ బెచార, పొన్నియన్ సెల్వన్ 1, పొన్నియన్ సెల్వన్ 2 , రాయన్, ఆడు జీవితం, వంటి సినిమాలకి సంగీతం అందించారు రెహమాన్ (AR Rahman) .

ప్రస్తుతం ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా మూవీ. ఈ సినిమా కోసం అప్పుడే 3 ట్యూన్ లు ఇచ్చేశారు రెహమాన్. చాలా కాలం తర్వాత ఆయన పని చేస్తున్న స్ట్రైట్ తెలుగు మూవీ ఇది. ఇక రెహమాన్ (AR Rahman) విడాకుల మేటర్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

నాగచైతన్య పెళ్లి పత్రికలో ఇది గమనించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus