అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) రెండో వారం కూడా మంచి నంబర్లు పెట్టింది. మూడో వారంలోకి ఎంటర్ అయినా.. అదీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా థియేటర్స్ బాగానే దక్కాయి. నార్త్ లో అయితే ‘పుష్ప 2’ కి మరో 2 వారాలు తిరుగులేనట్టే అని చెప్పాలి. అక్కడ ఈ సినిమా ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుంది.తెలుగు రాష్ట్రాల్లో కొంచెం నెమ్మదించింది. ఇక్కడ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కాలేదు.
అయితే ఇక్కడ కూడా లాంగ్ రన్ కి ఛాన్స్ ఉంది కాబట్టి, బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకసారి ‘పుష్ప 2’ 2 (Pushpa 2 The Rule) వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 77.31 cr |
సీడెడ్ | 29.66 cr |
ఉత్తరాంధ్ర | 20.16 cr |
ఈస్ట్ | 10.61 cr |
వెస్ట్ | 8.40 cr |
కృష్ణా | 10.30 cr |
గుంటూరు | 12.39 cr |
నెల్లూరు | 6.40 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 173.86 cr |
కర్ణాటక | 38.00 cr |
తమిళనాడు | 11.60 cr |
కేరళ | 9.92 cr |
ఓవర్సీస్ | 97.40 cr |
నార్త్ | 262.65 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 593.43 cr (షేర్) |
‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.593.43 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.11.57 కోట్ల షేర్ ను రాబట్టాలి.