Vidudala Part 2 First Review: ‘మహారాజ’ తర్వాత విజయ్ సేతుపతి ఇంకో హిట్టు కొడతాడా?

[Click Here For Full Review]

 

‘విడుదల పార్ట్ 1’ 2023 ఏప్రిల్లో రిలీజ్ అయ్యింది. ఇది దర్శకుడు వెట్రిమారన్ స్టైల్లో సాగే ఓ పీరియాడికల్, రా అండ్ రస్టిక్ డ్రామా. అప్పట్లో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను ‘ప్రజా దళం’ వ్యతిరేకిస్తూ… ప్రభుత్వ కార్యకలాపాలు అడ్డుకోవడం, ఈ క్రమంలో బాంబుల వేసి రైలుని పేల్చడం వంటివి చూపించారు. ఇదంతా చేస్తుంది ప్రజా దళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి) (Vijay Sethupathi)  అని, అతన్ని పట్టుకోవడానికి ‘ఆపరేషన్ గోస్ట్ హంట్’ పేరుతో పోలీసులు వారి బంధు మిత్రులని చిత్రహింసలకు గురి చేయడం వంటివి చూపించారు.

Vidudala Part 2 First Review

ముఖ్యంగా స్త్రీలని పోలీసులు చిత్రహింసలు పెట్టే సన్నివేశాలు చాలా రా..గా ఉంటాయి.మరోపక్క పోలీస్ ట్రైనింగ్ కి వచ్చిన డ్రైవర్ కుమరేశన్ (సూరి) పెరుమాళ్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించడంతో మొదటి భాగం ముగుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అనే ప్రశ్నకు సమాధానమే ‘విడుదల 2’ (Viduthalai Part 2) . డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని ఆల్రెడీ కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకి చూపించడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. సెకండ్ పార్ట్ లో పెరుమాళ్ ఫ్లాష్ బ్యాక్ ను చూపించారట. మహాలక్ష్మి(మంజు వారియర్) (Manju Warrier) తో అతని ప్రేమాయణం., ఆమెకు ఏమైంది? వంటివి వాటితో ఆసక్తిగా సాగుతుందట సెకండ్ పార్ట్.

అలాగే పెరుమాళ్ పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? కుమరేశన్ ప్రియురాలు తమిళరసి(భవాని శ్రీ) ఏమైంది? అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్..లో లానే ‘విడుదల 2’ కూడా చాలా రా..గా ఉంటుందట. మళ్ళీ క్లైమాక్స్ ఎమోషనల్ గా సాగుతుందట. అలాగే 3వ పార్ట్ కి కూడా లీడ్ ఇచ్చారట. వెట్రిమారన్ (Vetrimaaran)  సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ ఏడాది ‘మహారాజ’ తో హిట్ అందుకున్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) .. ‘విడుదల 2’ తో మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

కన్నీళ్లు పెట్టిస్తుంది సరే.. కాసులు కురిపించేలా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus