ఈ మధ్యనే ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) రిలీజ్ అయ్యింది. ఆ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ జపాన్లో ఉంటుంది. ఓ కంటైనర్ నుండి అల్లు అర్జున్ ని (Allu Arjun) విలన్ గ్యాంగ్ బయటకు తీయడం. ఆ తర్వాత అతను జపాన్లో మాట్లాడటం జరుగుతుంది. ఈ మధ్య మన తెలుగు సినిమాలని జపాన్ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. ‘బాహుబలి’ (Baahubali) ‘సాహో’ (Saaho) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ‘సలార్’ (Salaar) వంటి సినిమాలు బాగా ఆడాయి. దీంతో అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు మన హీరోలు ప్రయత్నిస్తున్నారు.
అందుకే అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 లో జపాన్లో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. జపాన్లో ప్రభాస్ కి (Prabhas) మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా జనవరి 3న ‘కల్కి 2898 ad’ (Kalki 2898 AD) అక్కడ విడుదల కాబోతుంది. కానీ ప్రభాస్ అక్కడి ప్రమోషన్స్ కి వెళ్లలేకపోతున్నాడు. దీంతో ఓ వీడియో ద్వారా జపాన్ అభిమానులకి అతను క్లారిటీ ఇచ్చాడు. ఇందులో కొన్ని చోట్ల అతను జపనీస్ లో మాట్లాడటం విశేషంగా చెప్పుకోవాలి.
ప్రభాస్ మాట్లాడుతూ.. “జపాన్ ప్రేక్షకులందరికీ హాయ్.(జపాన్లో) కొన్నేళ్లుగా మీరు నా పై చూపిస్తున్న ప్రేమకి చాలా థాంక్స్. ‘కల్కి’ జపాన్ లో విడుదల కావడం అనేది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. మూవీ మీ అందరకి బాగా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.నేను జపాన్ కి ప్రమోషన్స్ కి రావాలని చాలా కాలంగా ఎదురుచూశాను.
కానీ నాకు చిన్న గాయం అవ్వడంతో రావడం కుదరట్లేదు. ఇందుకు గాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కచ్చితంగా మీకోసం వస్తాను” అంటూ జాపాన్ భాషలో మాట్లాడి వాళ్ళని బుజ్జగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :