అల్లు అర్జున్ (Allu Arjun) , సుకుమార్(Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) మొదటి వారం ‘బాహుబలి 2’ (Baahubali 2) పేరిట ఉన్న చాలా రికార్డులని బ్రేక్ చేసింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా మొదటి వీకెండ్ కి రికార్డు ఓపెనింగ్స్ ను సాధించగా… వీక్ డేస్ లో కూడా చాలా బాగా కలెక్ట్ చేసి సునాయాసంగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. చూస్తుంటే రెండో వారం కూడా మంచి నంబర్స్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెర్ఫార్మన్స్ సోసోగానే ఉంది.
కానీ నార్త్, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తుంది.కేరళలో మాత్రం సినిమాకి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 63.25 cr |
సీడెడ్ | 25.00 cr |
ఉత్తరాంధ్ర | 15.95 cr |
ఈస్ట్ | 8.63 cr |
వెస్ట్ | 7.09 cr |
కృష్ణా | 8.24 cr |
గుంటూరు | 11.17 cr |
నెల్లూరు | 5.23 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 144.56 cr |
కర్ణాటక | 29.10 cr |
తమిళనాడు | 8.20 cr |
కేరళ | 9.55 cr |
ఓవర్సీస్ | 83.60 cr |
నార్త్ | 175.79 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 450.80 cr (షేర్) |
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.450.8 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.149.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.