స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) పెళ్ళిచేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియుడు ఆంటోనీతో ఆమె ఏడు అడుగులు వేసింది. నవంబర్లో కీర్తి సురేష్ పెళ్ళి గురించి అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. గోవాలో ఈమె ఆంటోనీ అనే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటున్నట్టు ప్రకటన వచ్చింది. క్రిస్టియన్ అయినటువంటి ఆంటోనీని కీర్తి సురేష్ హిందూ సంప్రదాయంలో పెళ్ళి చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. కీర్తి మలయాళం అమ్మాయి.. వారి పద్దతిలోనే కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
15 ఏళ్ళుగా ఆంటోనీ – కీర్తి ప్రేమలో ఉన్నారు అని తెలుస్తుంది. ఆంటోనీ పూర్తి పేరు ఆంటోనీ తటిల్. ఇతను దుబాయ్ కి చెందిన బిజినెస్ మెన్. అలాగే ఓ పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. ఇక ‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్.. ఆ తర్వాత ‘నేను లోకల్’ ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమాల్లో నటించింది. సావిత్రి జీవిత ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమా కీర్తి సురేష్..కి స్టార్ డం తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. పోటీగా చాలా మంది కొత్త హీరోయిన్లు వచ్చినప్పటికీ.. కీర్తి సురేష్ హవా తగ్గలేదు. ‘దసరా’ వంటి సినిమాల్లో నటిస్తూనే ఉంది. చిరంజీవి ‘భోళా శంకర్’, రజినీకాంత్ ‘పెద్దన్న’ వంటి సినిమాల్లో కూడా ముఖ్య పాత్రలు పోషించింది. మరి పెళ్ళి తర్వాత ఈమె సినిమాల్లో నటిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఆ విషయాలు పక్కన పెట్టేసి కీర్తి సురేష్ పెళ్ళి ఫోటోలు ఓ లుక్కేయండి :