Allu Arjun: పోలిటికల్ పుకార్లకు చెక్ పెట్టిన బన్నీ టీమ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ‘పుష్ప 2’  (Pushpa 2: The Rule)  విజయంతో తానేంటో మరోసారి నిరూపించుకున్నారు. ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా సక్సెస్ టూర్స్ లో పాల్గొనే ప్లాన్ చేశారు. అయితే, ఈ హడావుడి మధ్య అతడి రాజకీయ రంగప్రవేశంపై అనేక పుకార్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ వార్తలు కొద్ది గంటల్లోనే ప్రధాన మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే బన్నీ టీమ్ ఈ పుకార్లకు మొదట్లోనే చెక్ పెట్టేందుకు ముందుకొచ్చింది.

Allu Arjun

అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు అసత్యమని స్పష్టతనిచ్చారు. ఇలాంటి అపోహలు నిర్ధారణ లేకుండా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నిజమైన సమాచారం కోసం మాకు సంబంధిత అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలి అంటూ ఒక నోట్ రిలీజ్ చేశారు. దీన్ని బట్టి అల్లు అర్జున్ గారు ప్రస్తుతం సినిమాలతో మాత్రమే బిజీగా ఉన్నారని ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల టైమ్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), బన్నీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు అనేక రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అలాగే వైసీపీ లీడర్ శిల్పా రవితో కూడా మంచి స్నేహం ఉండడం వల్ల అప్పట్లో పుష్ప 2పై ఇంపాక్ట్ చూపించే పరిస్థితి ఏర్పడింది. కాలం గడిచిన అనంతరం మెల్లగా ఆ వివాదాలను అందరూ మర్చిపోయారు. ఇక ఇప్పుడు పవన్ తో అనుబంధం మరింత బలపడినట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ రిలీజ్ సమయంలో పవన్ టికెట్ ధరల విషయంలో మద్దతు ఇవ్వడం, బన్నీ కూడా పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం వంటి అంశాలు అభిమానుల్లో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌ను రేకెత్తించాయి.

ఇక రాబోయే ప్రాజెక్టుల విషయానికి వస్తే, బన్నీ త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో మరో భారీ పాన్-ఇండియా సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ సినిమాను జనవరిలో ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే, ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ఫేమ్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus