సుకుమార్ అండ్ టీమ్ కి అంత సీన్ ఉందా..?

  • February 11, 2021 / 05:53 PM IST

అల్లు అర్జున్ పుష్ప సినిమా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రోజుకో అప్ డేట్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది ఈ సినిమా. అంతేకాదు, మొన్నటి దాకా ఈ సినిమాని ఐదుభాషల్లో మాత్రమే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ, ఇప్పుడు ఏకంగా పది భాషల్లో సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. రీసంట్ గా రంపచోడవరంలో షూటింగ్ ని ఫినిష్ చేస్కున్న చిత్రయూనిట్ అక్కడ తీసిన రష్ పై ఎంతో ఖుషీగా ఉన్నారు. అంతేకాదు, అల్లు అర్జున్ మాస్ లుక్ అనేది ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

రష్మిక మందన రీసంట్ గా ఇచ్చిన ఇంటర్య్వూ, అల్లు అర్జున్ పోస్టర్స్ సినిమాకి హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. అందుకే ఇప్పటికే ఈసినిమాపై భారీ ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట. ముఖ్యంగా వేరే భాషల నుంచి అల్లు అర్జున్ సినిమాని కొనేందుకు చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారని, ముందుగే అడ్వాన్స్ ఇచ్చేయడానికి రెడీగా ఉన్నారని కూడా చెప్తున్నారు. ఆగష్ట్ 13వ తేదిన సినిమాని రిలీజ్ చేస్తున్నామని ఎనౌన్స్ చేయడం అనేది మార్కెట్ ని పెంచేస్తోంది.

ఇప్పుడు అన్ని భాషల్లో కలుపుకుని పుష్ప ఎంత ప్రీరిలీజ్ మార్కెట్ ని కలక్ట్ చేయబోతోందని అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో దాదాపుగా 500కోట్ల మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా టాక్ అయితే వినిపిస్తోంది. ఒక్క హిందీలోనే ఈసినిమాని 100కోట్ల మార్కెట్ చేయాలని చూస్తున్నారట. ఇక తెలుగులో కూడా 150కోట్లకి పైగానే మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కులు అలాగే వేరే భాషల్లో బిజినెస్ కలుపుకుని మరో 250కోట్లు బిజినెస్ చేయాలని భావిస్తున్నట్లుగా టాక్ వినపిస్తోంది. ఈ లెక్కన పుష్ప చాలా ఈజీగా రిలీజ్ టైమ్ కి 500కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుందా అని అంచనాలు వేస్తున్నారు.

ఇదే గనక జరిగితే అల్లు అర్జున్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా ఇది నిలుస్తుంది. ఇంతవరకూ తెలుగులో వచ్చిన సినిమాల్లో భారీ బిజినెస్ అయిన సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా, తెలుగు సినిమా సత్తాని మరోసారి చూపించబోతోంది ఈ సినిమా. అయితే మరోవైపు సుకుమార్ అండ్ టీమ్ ఇన్ని లెక్కలు వేసుకుని సినిమాకి హైప్ తెస్తున్నారా.. అసలు ఈసినిమాకి అంత బిజినెస్ చేసే సీన్ ఉందా అని కూడా అంటున్నారు మరోవర్గం. ఏది ఏమైనా ఈసినిమా ఖచ్చితంగా సెన్సేషనల్ మార్కెట్ అయ్యేలాగానే కనిపిస్తోంది. మరి పుష్ప ఏ రేంజ్ లో బిజినెస్ ని రాబడతాడు అనేది చూడాలి.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus