Radhe Shyam Collections: అయ్యబాబోయ్ ..ఇక మిరకిల్స్ జరిగినా కష్టమే ?

Advertisement

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పెర్ఫార్మన్స్ ఇస్తుంది. మిడ్ రేంజ్ హీరోలకి నమోదయ్యే కలెక్షన్లు కూడా ఈ చిత్రానికి రావడం లేదు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కృష్ణంరాజు, భాగ్య శ్రీ, జగపతి బాబు, మురళీ శర్మ తదితరులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

Click Here To Watch Now

మొదటి రోజు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను రాబట్టింది.కానీ సోమవారం నుండీ ఈ చిత్రం కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 23.40 cr
సీడెడ్ 07.07 cr
ఉత్తరాంధ్ర 04.79 cr
ఈస్ట్ 04.11 cr
వెస్ట్ 03.17 cr
గుంటూరు 04.27 cr
కృష్ణా 02.51 cr
నెల్లూరు 02.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 51.37 cr
తమిళ్ నాడు   0.74 cr
కేరళ   0.32 cr
కర్ణాటక 04.15 cr
నార్త్ ఇండియా (హిందీ) 08.00 cr
ఓవర్సీస్ 11.02 cr
రెస్ట్  04.07 cr
టోటల్ వరల్డ్ వైడ్  79.67 cr

‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.79.67 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.120.33 కోట్ల షేర్ ను రాబట్టాలి. అది పూర్తిగా అసాధ్యమనే తేలిపోయింది. ఈ చిత్రానికి నైజాం కూడా కలెక్షన్లు నమోదు కావడం లేదు.

కనీసం రూ.100 కోట్ల షేర్ ను టచ్ చేసే అవకాశం కూడా ఈ చిత్రానికి కనిపించడం లేదు. ఈ శుక్రవారం హోలీ హాలిడే ఉంది, శని, ఆది వారాలు కూడా కలిసొచ్చే అంశం. దానినైనా ‘రాధే శ్యామ్’ ఉపయోగించుకుంటుందేమో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus