‘రాధే శ్యామ్’..త్వరలో ప్రభాస్ నుండీ రాబోతున్న మూవీ ఇది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోంది. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే ముందే ఈ మూవీ ప్రారంభం అయ్యింది. కానీ ఇంకా ఈ చిత్రం విడుదల కాలేదు. సంవత్సరంన్నర నుండీ కరోనా ఎఫెక్ట్ పడింది కాబట్టి.. షూటింగ్ కు అంతరాయం కలగడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
కానీ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ షూటింగ్ వాయిదా పడింది. దాంతో జూలై 30న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. అయితే అదే రోజున ‘రాధే శ్యామ్’ టీం కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో 2022 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ప్రచారం మొదలైంది. ఒకవేళ అదే నిజమైతే.. నిర్మాతలు పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాని రిలీజ్ చేయాలంటే అన్ని భాషల్లోనూ ఏ సినిమా రిలీజ్ కాని టైములో రిలీజ్ చేసుకోవాలి.
ఒక్క మాటలో చెప్పాలి అంటే సోలో రిలీజ్ మస్ట్. ‘రాధే శ్యామ్’ మూవీకి రూ.250 కోట్ల బడ్జెట్ అయ్యింది. దానికి తగ్గ బిజినెస్ జరగాలి అంటే మాత్రం కనీసం వారం రోజులు పాటు ఏ సినిమా విడుదల కాకుండా చూసుకొని విడుదల చేసుకోవాలి. అలా అయితేనే అటు బిజినెస్ పరంగా ఇటు కలెక్షన్ల పరంగా బాగుంటుంది.అసలే 2022 సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ‘ఎఫ్3’ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో థియేటర్ల సమస్య ఎక్కువైపోతోంది.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!