Prabhas: ‘రాధే శ్యామ్’.. వాలెంటైన్స్ డే గ్లింప్స్ లో అదే హైలెట్..!

  • February 14, 2022 / 02:24 PM IST

‘కుక్ చేస్తావు.. బాగా మాట్లాడతావ్.. ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్ళి ఎందుకు కాలేదు’ అంటూ మన ప్రభాస్ ను అడుగుతుంది పూజా హెగ్డే. వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా ఈరోజు ప్రభాస్ అభిమానులకి ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమాకి సంబంధించి ఓ గ్లింప్స్ ను విడుదల చేసారు మేకర్స్. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ గ్లింప్స్ చూడ్డానికి చాలా రిచ్ గా, స్టైలిష్ గా, రొమాంటిక్ గా సాగింది.

Click Here To Watch

‘వాడి మొహం ఇక లైఫ్ లో చూడను అని హీరోయిన్ పూజా హెగ్డే అంటుంటే…’100 నా లక్కీ నెంబర్’ అంటూ ప్రభాస్ అంటున్నాడు. కమెడియన్ ప్రియదర్శి కూడా ఈ గ్లింప్స్ లో దర్శనమిచ్చాడు. మార్చి 11న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు ఈ గ్లింప్స్ ద్వారా మరోసారి కన్ఫర్మ్ చేసారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉండగా.. ప్రభాస్ పెళ్ళి అనేది ఎప్పుడూ హాట్ టాపిక్కే..! ఈ సాధారణంగా ప్రభాస్ ఈ విషయం పై ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేస్తుంటాడు.

అతను నటించే సినిమాలకి సంబంధించిన దర్శకనిర్మాతలు కూడా ఈ విషయం పై రియాక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడుతుంటాడు. కానీ ‘రాధే శ్యామ్’ వాలెంటైన్స్ డే గ్లింప్స్ లో ప్రభాస్ పెళ్ళి ప్రస్తావన వచ్చింది. ట్రైలర్లో కూడా ‘అమ్మ పెళ్ళి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్ళి లేవు’ అనే డైలాగ్ కూడా ఉంటుంది. ప్రభాస్ కావాలనే తన పెళ్ళి పై వస్తున్న ప్రశ్నలకి పరోక్షంగా ఇలా స్పందిస్తున్నాడా? అనే డిస్కషన్లు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి.

ఇటీవల వచ్చిన ‘మళ్ళీ మొదలైంది’ అనే సినిమాలో ‘పాన్ ఇండియా అంతా వెయిట్ చేయడానికి ఇదేమైనా ప్రభాస్ పెళ్ళా’ అంటూ సుమంత్ తో డైలాగ్ కూడా చెప్పించారు అంటే ప్రభాస్ పెళ్ళి ఏ రేంజ్లో వైరల్ న్యూసో అర్ధం చేసుకోవచ్చు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!


ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus