Radhika Apte: పెళ్లి ఫొటోలు లేకపోవడానికి కారణమదే.. హీరోయిన్ వ్యాఖ్యలు!

గ్లామరస్ రోల్స్ లో కనిపించడమే కాదు.. బోల్డ్ పాత్రల్లో నటించి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది హీరోయిన్ రాధికా ఆప్టే. ఈ బాలీవుడ్ బ్యూటీ ‘వాహ్.. లైఫ్ హో తో ఐసే’ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ వంటి సినిమాల్లో నటించింది. రీసెంట్ గా ఈమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని వెల్లడించింది. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. పదేళ్ల ముందు 2012లో లండ‌న్‌ కు చెందిన మ్యూజీషియ‌న్ బెన‌డిక్ట్ టేల‌ర్‌ ను పెళ్లి చేసుకుంది రాధికా ఆప్టే. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ సమయంలో ఎవరూ ఈ విషయాన్ని నమ్మలేదు. దానికి కారణం ఏంటో ఆమెని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. పెళ్లి సమయంలో ఫొటోలు తీసుకోలేదని చెప్పింది రాధికా. ఆమె మాట్లాడుతూ.. ‘నేను, బెనడిక్ట్ పెళ్లి పెళ్లి చేసుకున్నప్పుడు ఫొటోలు తీసుకోలేదు.

మా పెళ్లికి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. భోజనాలు చేశాం. వచ్చిన స్నేహితుల్లో చాలా మంది ఫొటోగ్రాపర్స్ ఉన్నప్పటికీ ఎవరూ ఫొటోలు తీయించుకోలేదు. అందు కారణం మేం పెళ్లిలో బాగా డ్రింక్ చేశాం. అందుకనే పెళ్లి రోజున నా భర్త ఫొటోలు తీయించలేదు. అందువల్లనే పెళ్లికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు’ అని చెప్పుకొచ్చింది.

కొన్నాళ్లక్రితం ఈ బ్యూటీ దక్షిణాది సినిమాలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఆమెని దారుణంగా ట్రోల్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈమె ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ లో నటిస్తోంది. అలానే ‘మోనిక ఓ బై డార్లింగ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus