దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడిగా ఇంకా సరైన బ్రేక్ అందుకోలేదు. గత ఏడాది ఆయన హిందీలో చేసిన జడ్జ్మెంటల్ హై క్యా మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో సరైన సక్సెస్ లేక అల్లాడుతున్న ప్రకాష్, వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులకు లోనైంది. ప్రకాష్ కోవెలమూడి తన భార్య కనిక ధిల్లాన్ తో విడిపోయారు. సినిమా రచయిత అయిన కనిక ప్రకాష్ తెరకెక్కించిన సైజు జీరో చిత్రానికి కథ కూడా అందించారు.
2014లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. కారణాలేమైనా పెళ్ళైన మూడేళ్లకు అనగా 2017లో విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విషయం ఓ ప్రముఖ డైలీ బయటపెట్టే వరకు తెలియదు. గత ఏడాది ప్రకాష్ మరియు కనిక విడిపోయినట్లు తెలిసింది. కాగా కనిక ధిల్లాన్ ప్రస్తుతం ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉందట. రచయిత అయిన హిమాన్షు శర్మతో ఆమె అఫైర్ సాగిస్తున్నారట. దీనితో త్వరలో వీరిద్దరూ వివాహం చేసుకోవడం అనేది ఖాయంగా కనిపిస్తుంది.
వీరి వివాహం పై బాలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తుండగా, అధికారిక ప్రకటన అయితే లేదు. కనిక సన్నిహితుల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారట. ఇక ప్రకాష్ కోవెలమూడి ఇంకా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. ఐతే ఆయన పెళ్లిపై కొద్దిరోజుల క్రితం కొన్ని రూమర్లు వచ్చాయి. స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క ప్రకాష్ కోవెలమూడిని పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రావడం జరిగింది. రాఘవేంద్రరావు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిఉన్న అనుష్క ఇందుకు ఒప్పుకున్నారని వార్తలు రావడం జరిగింది. ఈ వార్తలపై ఎవరూ స్పందించకపోవడం విశేషం.
Most Recommended Video
ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!