రాహుల్ సిప్లిగంజ్ కు అస్సలు మాట్లాడటం రాదంటూ వ్యాఖ్యలు…!

‘బిగ్ బాస్ 3’ విన్నర్ అలాగే ప్రముఖ సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ ఈ మధ్య కాలంలో ఎదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తున్నాడు. షో ముగిశాక పునర్నవి తో ప్రేమాయణం … డేటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. హైటెక్ సిటీ సమీపంలో ఆమెను బైక్ పై తిప్పుతూ కనిపించాడని.. ఆమెతో రాహుల్ డేటింగ్ లో ఉన్నాడని కూడా కామెంట్స్ వినిపించాయి. ఇక మొన్నటికి మొన్న…ఎం.ఎల్.ఏ రోహిత్ రెడ్డి తమ్ముడు … రిషిక్ రెడ్డి తన అనుచరులతో రాహుల్ పై బీర్ బాటిల్స్ తో కొట్టించడం పెద్ద సంచలనం సృష్టించింది. అటు తరువాత రాహుల్ ను హాస్పిటల్ కు తరలించడం .. సాయంత్రానికి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

అయితే ఈ విషయం పై బీజేపీ నేత శ్వేతా రెడ్డి చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ అవుతున్నాయి. “రాహుల్ కు అస్సలు మాట్లాడటం రాదు. మీరు పబ్ కు ఎందుకు వెళ్లారు అని మీడియా వారు అడిగితే… ‘మీరెల్లరా’ అని ప్రశ్నిస్తాడు. ఓ సెలబ్రిటీ అయ్యి ఉండి అసభ్యకరమైన పద జాలంతో మాట్లాడాడు. ఆ మాత్రం అడిగితేనె అంత తప్పు వచ్చేసిందా.? అసలు గొడవ రాహుల్ వల్లే మొదలై ఉంటుంది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఏమైనా మీరు .. మీరు ఒకటే అంటూ పొలిటీషియన్లను ఉద్దేశిస్తూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రాహుల్ అభిమానులయితే.. ‘అటూ ఇటూ తిప్పి రాహుల్ ను ఇరికించేలా ఉన్నారు… అసలు పబ్ కు వెళ్తే తప్పేంటి… మీరు వెళ్ళరా అని రాహుల్ అడిగితే మాత్రం ఏమి తప్పు వచ్చింది. అతను ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడతాడు అందులో తప్పేముంది’ అంటూ మండిపడుతున్నారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus