Rahul Sipligunj: కొత్తింట్లోకి అడుగుపెట్టిన రాహుల్‌ సిప్లిగంజ్‌..ఎమోషనల్ పోస్ట్ వైరల్!

  • August 22, 2022 / 12:38 PM IST

రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఈ పేరు ఇప్పుడు చాలా ఫేమస్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చార్ట్ బస్టర్ సాంగ్స్ పాడాడు. బిగ్‌బాస్‌ 3లో ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి విన్నర్‌గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.హౌస్ లో ఉన్నప్పుడు మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ శ్రీముఖి ఇతన్ని టార్గెట్ చేయడంతో.. ఇతని పై సింపతీ క్రియేట్ అయ్యింది. అందువల్ల ఇతనికి క్రేజ్ పెరగడం… టైటిల్ విన్నర్ గా నిలిచేంత వరకు వెళ్లడం జరిగింది.

బిగ్‌బాస్‌ తర్వాత కూడా రాహుల్ కు వరుస సినిమాల్లో పాటలు పాడే అవకాశాలు లభించాయి. మరో పక్క ఆల్బమ్స్‌ కూడా చేస్తూ ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు. ‘రంగమార్తాండ’ అనే సినిమాలో కూడా రాహుల్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. ఇక సోషల్‌ మీడియాలో కూడా బాగా యాక్టీవ్‌గా ఉండే రాహుల్‌ సిప్లిగంజ్‌ తన పర్సనల్‌ లైఫ్‌ కు సంబంధించిన విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా ఓ గుడ్ న్యూస్ ను తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు రాహుల్‌ సిప్లిగంజ్‌.

కొత్త ఇంటి కలను సాకారం చేసుకుని, అందులో అడుగుపెట్టినట్టు రాహుల్ చెప్పుకొచ్చాడు.హౌస్ లో ఉన్న రోజుల్లో సొంతిల్లు అనేది తన కల అంటూ రాహుల్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.మొత్తానికి తాను అనుకున్నది సాధించాడు.తాజాగా గృహప్రవేశం వీడియోను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి.. ‘మీ ఆదరణ వల్లే ఇది సాధ్యం అయ్యింది’ అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అతని కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో, ఫొటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus