టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి అప్పట్లో కొని మాటలు వినిపించాయి. ఓ నిర్మాత ఇచ్చిన విల్లాకు ఆశపడి వరుసగా మూడు సినిమాలు అదే నిర్మాతతో చేశాడని అంటారు. ఆ మూడు సినిమాల్లో ఏదీ వర్కవుట్ కాలేదు. తాజాగా ఈ విషయంపై రాజ్ తరుణ్ స్పందించారు. విల్లాకు ఆశపడి మూడు సినిమాలు చేయలేదని అంటున్నారు. తను మూడు సినిమాలు చేసే క్రమంలో విల్లా వచ్చిందని స్టోరీ చెప్పుకొచ్చారు.
అనిల్ సుంకర తనకు విల్లా ఆఫర్ ఇవ్వలేదని.. నిజానికి ఆ విల్లా తీసుకునే సమయానికి మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయని.. అప్పటికే తను కొంత రెమ్యునరేషన్ కూడా తీసుకున్నానని చెప్పారు. డబ్బులిస్తే వెంటనే ఖర్చు పెట్టేస్తానని రాజా రవీంద్ర అలా సెట్ చేశారని తెలిపారు. అనిల్ సుంకర గారితో మొదటి ఒక సినిమానే అనుకున్నామని.. ఆ సినిమా సెట్స్ పై ఉండగా మరో రెండు కథలొచ్చాయని గుర్తు చేసుకున్నారు.
ఆ రెండు కథలు కూడా తానే నిర్మిస్తానని అనిల్ సుంకర గారు అనడంతో.. ఒకేసారి ఎక్కువ డబ్బులొస్తే ఖర్చు పెట్టేస్తానని.. అనిల్ సుంకరతో రాజా రవీంద్ర తనకు విల్లా ఇప్పించారని తెలిపారు. విల్లా కోసం ఆ మూడు సినిమాలు చేయలేదని.. ఆ సినిమాలు చేసే క్రమంలో విల్లా వచ్చిందని అన్నారు. ప్రస్తుతం అదే విల్లాలో ఉంటున్నట్లు చెప్పారు. అనిల్ సుంకర నిర్మాతగా.. ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’, ‘అంధగాడు’, ‘రాజుగాడు’ సినిమాల్లో నటించారు రాజ్ తరుణ్.
ఈ సినిమాల్లో ఒక్కటి కూడా హిట్ కాలేదు. ఈ సినిమాలు చేస్తున్న సమయంలో ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్నారు రాజ్ తరుణ్. అదే ‘శతమానం భవతి’. చేతిలో వరుస సినిమాలు ఉండడంతో ‘శతమానంభవతి’ సినిమాకి సమయం కేటాయించలేకపోయానని చెప్పుకొచ్చారు రాజ్ తరుణ్. రీసెంట్ గా ఇతడు నటించిన ‘ఆహా నా పెళ్లంట’ అనే వెబ్ సిరీస్ ఓటీటీలో విడుదలైంది.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!