NTR, Rajamouli: తారక్ ప్రశ్నకు జక్కన్న సమాధానం ఇదే!

  • March 18, 2022 / 07:07 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి టాలీవుడ్ హీరోలందరితో స్నేహపూర్వకంగా మెలుగుతారనే సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో నటించాలని టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్, తారక్, ప్రభాస్ లతో ఎక్కువ సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి భవిష్యత్తులో బన్నీతో కూడా ఒక సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే రాజమౌళి మనసులో ఏ హీరో ఉన్నాడో తెలియాలంటే మాత్రం స్వయంగా ఆయన స్పందించే వరకు ఆగాల్సిందే. ఆఫ్ ది రికార్డు పేరుతో ఆర్ఆర్ఆర్ టీమ్ తాజాగా ఒక వీడియోను విడుదల చేసింది.

Click Here To Watch Now

ఈ వీడియోలో తారక్ తనదైన శైలిలో అల్లరి చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీడియోలో తారక్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కొరకు తిరగలేక తన పనైపోయిందని కామెంట్లు చేస్తూ జక్కన్నకు దండాలు పెట్టారు. చరణ్ తాను ఫ్యాన్స్ మధ్య చిరుత మూవీ చూశానని చెప్పగా ఎన్టీఆర్ తాను ఫ్యాన్స్ మధ్య ఒక్క మూవీ కూడా చూడలేదని వెల్లడించారు. రాజమౌళి ఎన్టీఆర్ ను ఈవెంట్ లో ఎంట్రీ గురించి అడగగా ఎలాగోలా వస్తామని తారక్ వెల్లడించారు.

ఆ తర్వాత తారక్ రాజమౌళితో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ కు ప్రభాస్ వస్తాడా? అని అడిగారు. రాజమౌళి ఆ ప్రశ్నకు స్పందిస్తూ ప్రభాస్ ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కు రావడం జరగదని తెలిపారు. ఆ తర్వాత తారక్ ప్రభాస్ ను చరణ్ తీసుకొస్తాడని చెప్పగా చరణ్ నేను కూడా నీతోనే ఉంటానని చెప్పడంతో తారక్ మనం వెళ్లి ప్రభాస్ ను తీసుకొద్దామని చరణ్, రాజమౌళితో చెబుతాడు. రాజమౌళి నాపై పీకల వరకు కోపం వచ్చిందా? అని అడగగా వచ్చిందని తారక్ సమాధానం చెప్పారు.

చరణ్ కూడా తనకు కోపం వచ్చిందని జక్కన్నతో వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో వేగం పెరగడంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాకు మేకర్స్ కొత్తగా ప్రమోషన్స్ ను చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus