Rajamouli: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం అంతకుమించి లెవల్‌లో!

  • July 29, 2021 / 12:52 PM IST

రాజమౌళి సినిమా ఎంత డిఫరెంట్‌గా తీస్తాడో, ఎంత భారీగా ఉండేలా చూసుకుంటాడో… ప్రచారం విషయంలోనూ అలానే ఆలోచిస్తాడు. ఇప్పటివరకు తన సినిమాల విషయంలో ఇలా వైవిధ్యమైన ప్రచారమే చేసుకుంటూ వచ్చాడు. ఆశించిన ఫలితాలూ సాధించాడు. తాజాగా మరోసారి తన ట్రేడ్‌ మార్క్‌ ప్రచారంపై దృష్టిపెట్టాడు జక్కన్న. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం జోరు పెంచాడు. రాజమౌళి సినిమాల ప్రచారం గురించి చెప్పాలంటే ‘బాహుబలి’ రోజులు గుర్తు చేసుకోవాలి.

ఆ సినిమాకు అంత హైప్‌ వచ్చిందన్నా, సెకండ్‌ పార్టు కోసం జనాలు అంతగా వెయిట్‌ చేయడంలో ప్రచారం వాటా చాలానే ఉందని చెప్పాలి. ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి కూడా అదే చేయబోతున్నాడు. ముహూర్తం కింద మొన్న సినిమా మేకింగ్‌ వీడియో విడుదల చేసి వావ్‌ అనిపించాడు. ఫ్రెండ్‌ షిప్‌ డే నాడు స్పెషల్‌ సాంగ్‌ రాబోతోంది. ఈ లోపు రాజమౌళి టీమ్‌ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి చేసి… క్యాంపెయినింగ్‌ స్టార్ట్‌ చేస్తారట.

పాన్‌ ఇండియా సినిమా కాబట్టి దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేస్తారట. ప్రెస్‌ మీట్లు, ఇంటర్వ్యూలు అనేకాకుండా చిన్న చిన్న ఈవెంట్లు, ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ చేస్తారట. దీని కోసం జక్కన్న పథకాలు రచిస్తున్నారట ఇప్పుడు. ఒక్కో లాంగ్వేజ్‌ కోసం ఒక్కోలా ఈవెంట్స్‌ ఉండబోతున్నాయట. చూద్దాం ఏమేం చేస్తారో?

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus