మహేష్ సినిమాపై కిక్కిచ్చే మాట ఇచ్చిన రాజమౌళి!

Advertisement

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా ప్రేక్షకుల అంచనాల కంటే ఎక్కువగానే ఆలోచిస్తాడు అని చెప్పవచ్చు. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR సినిమా శుక్రవారం విడుదల అవుతున్న సందర్భంగా రాజమౌళి గత రెండు వారాలుగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా తర్వాత రాబోయే మహేష్ సినిమాపై గురించి కూడా అప్పుడప్పుడు రాజమౌళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా ఒక సినిమా విడుదలైతే గానీ మరొక సినిమా గురించి ఆలోచించను అని కానీ కరోణ కారణంగా తప్పని పరిస్థితుల్లో వెంటనే మరో సినిమా గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తున్నట్లుగా చెప్పాడు.

Click Here To Watch NOW

ఇక మహేష్ బాబు తో సినిమా ఎలా ఉంటుంది అనే ప్రశ్నలకు రాజమౌళికి చాలా ఇంటర్వ్యూలలో ఎదురయ్యాయి. కానీ రాజమౌళి మాత్రం ఏ విషయాన్ని కూడా బయటకు చెప్పడం లేదు. ఫైనల్ గా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఒక విషయాన్ని చాలా బలంగా చెప్పాడు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా మాత్రం బాహుబలి సినిమాలకు మించి ఉంటుంది అని చెప్పగలనని ఆ సినిమాతో మహేష్ బాబు చాలా సరికొత్తగా కనిపిస్తారు అని కూడా అన్నారు.

రాజమౌళి ఆ మాటలు చెప్పడంతో మహేష్ అభిమానులు ఎంతగానో ఆనందిస్తున్నారు. తప్పకుండా సినిమా ఫ్యాన్ ఇండియా కాకుండా అంతకు మించి అనేలా ఉంటుంది అని అర్థమవుతోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో తెరకెక్కే ఆ సినిమా షూటింగ్ ఇదే ఏడాది చివర్లో మొదలుపెట్టవచ్చు అని సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్న విషయం తెలిసిందే అంతేకాకుండా త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.

ఇక ఈ రెండు సినిమాల అనంతరం రాజమౌళి సినిమాను 2024 మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చు అనే సమాచారం. మరి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక రాజమౌళి అల్లు అర్జున్ తో కూడా భవిష్యత్తులో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus