ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం జక్కన్న వేసిన సెట్ ఫోటో లీక్

Advertisement

దర్శక ధీరుడు జక్కన్న, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో కలసి తీస్తున్న భారీ మల్టీస్టార్ సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఈ నెల 19 న హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి షెడ్యూల్ లోనే రాజమౌళి భారీ యాక్షన్ సీన్స్ తీస్తున్నాడు. ఇక రాజమౌళి తన సినిమాకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని లేదా ఏదైనా పోస్టర్ వంటివి రిలీజ్ చేస్తూ సినిమా రిలీజ్ లేట్ అయినా వీటితో కాస్త అభిమానులను కూల్ చేయడమే కాకుండా సినిమాపైన హైప్ తీసుకువస్తుంటాడు. అదేవిధంగా అయన సినిమాకి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు ఫోటోలు, సినిమాకి సంబంధించిన అప్డేట్లు లీక్ అవుతుంటాయి.

ఇక విషయంలోకి వెళితే, జక్కన్న, సీబిఐటి కాలేజీకి దగ్గరలో ఒక భారీ సెట్ ని నిర్మిస్తున్నాడు. ఇలా జక్కన వేసుకున్న సెట్ ఫోటో లీకై సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ సెట్ పూర్తయితే ఇక్కడ మూడు నెలల పాటు షూటింగ్ జరుగుతుందని అంటున్నారు. ఈ భారీ సెట్ నిర్మాణం చూస్తుంటే బ్రిటిష్ కాలం నాటిదిగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కథ స్వాత్యంత్ర పోరాట నేపథ్యంలో ఉంటుందని అందుకే ఈ సెట్ ప్లాన్ చేసి ఉంటారంటూ కొందరు అంటున్నారు. ఇక కథ విషయం ఏమో కానీ జక్కన ఎంతో జాగ్రత్తగా ఉన్నపటికీ ఇలా ఫోటో లీక్ అవ్వడం వలన మళ్ళీ ఇలాంటివి సెట్ లో జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read