Rajamouli: జక్కన్న సెంటిమెంట్ కచ్చితంగా బ్రేకవుతుంది.. తారక్ ఫ్యాన్స్ నమ్మకమిదే!

సినిమా రంగానికి చెందిన వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఆ సెంటిమెంట్లు ప్రూవ్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. రాజమౌళి డైరెక్షన్ లో నటించిన హీరో తర్వాత మూవీ ఫ్లాప్ అనే సెంటిమెంట్ స్టూడెంట్ నంబర్1 సినిమాతో మొదలైంది. అప్పటినుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతోంది. అయితే దేవర గ్లింప్స్ చూసిన ఫ్యాన్స్ ఈ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందని నమ్ముతున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఇండస్ట్రీ హిట్ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని తారక్ ఈ సినిమాలో నటించగా దేవర సినిమా కథ, కథనం విషయంలో ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

ఫిబ్రవరి నెల నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ నటించడంతో హిందీలో సైతం ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. దేవర డిజిటల్ హక్కులు ఒకింత భారీ మొత్తానికి అమ్ముడవగా ఈ సినిమా (Devara) ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ ఏకంగా 33 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. సరికొత్త కాన్సెప్ట్ తో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. జక్కన్న హీరో తర్వాత మూవీ ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఎన్టీఆర్ తోనే మొదలైందని ఆ సెంటిమెంట్ ఎన్టీఆర్ తోనే ముగుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అనిరుధ్ సైతం ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. ఇతర భాషల్లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. బాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర2 మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus