Rajinikanth: రజనీ – లోకేశ్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌తో అభిమానుల గుండెల్లో గుబులు!

  • September 15, 2023 / 02:12 PM IST

లోకేశ్ కనగరాజ్‌… సౌత్‌ సినిమా ఇండస్ట్రీలోనే ఈ పేరొక సంచలనం. హిట్‌ సినిమాలు ఎవరైనా తీస్తారు, కానీ కన్సిస్‌టెన్సీతో బ్లాక్‌బస్టర్‌లు ఇవ్వడం, అలాంటి సినిమాలే తీస్తాను అని అభిమానులకు భరోసా ఇవ్వడం ఆయనకు మాత్రమే సాధ్యం. మనకు తెలిసిన స్టార్‌ హీరోలనే మనం ఊహించని విధంగా చూపిస్తారు ఆయన. ఇక మరోవైపు వన్ అండ్‌ ఓన్లీ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ఆయన గురించి ఉపమానాలు, ఆయన ఘనతలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. ఇలాంటి ఇద్దరు కలసి ఓ సినిమా చేస్తారని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి.

చాలా కాలంగా ఈ సినిమా గురించి పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఇదిగో, అదిగో అంటూ వార్తలు రావడం మినహా సినిమా లెక్క తేలలేదు. ‘లియో’ సినిమా పనుల్లో లోకేశ్‌ బిజీగా ఉన్నారు కాబట్టి… ఈ సినిమా గురించి ఇన్నాళ్లు పుకార్ల వరకు ఆగిపోయాయి. ఇప్పుడు లోకేశ్‌ ఆ సినిమా నుండి ఫ్రీ అయిపోయాడు. మరో నెల రోజుల్లో ఆ సినిమా రిలీజ్‌ ఉంది. ఈ నేపథ్యంలో తర్వాతి సినిమాగా రజనీకాంత్‌ది ప్రకటించారు. ఈ సినిమా కూడా గ్యాంగ్‌స్టర్‌ డ్రామానే అంటున్నారు.

అయితే, లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లోకి ఈ సినిమా వస్తుందా లేదా అనేది తర్వాత తెలుస్తుంది. అయితే ఇప్పుడు రజనీకాంత్‌ ప్రేక్షకులకు మరో సమస్య వచ్చి పడింది. అయితే అది కొత్తదేం కాదు.. గతంలో వినిపించిన మాటే. అదేనండీ ‘ఆఖరి సినిమా’. లోకేశ్‌ సినిమా తర్వాత రజనీకాంత్‌ ఇక సినిమాలు చేయరు అనేది కోడంబాక్కం లేటెస్ట్‌ పుకారు. ఇప్పటికే సినిమాల విషయంలో ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారని, ఇదే ఆఖరి సినిమా అని అంటున్నారు.

ఒకవేళ పుకార్లు నిజమై, లోకేశ్‌ సినిమానే (Rajinikanth) రజనీకి ఆఖరిదైతే.. ఫ్యాన్స్‌ కన్నీళ్లకు అడ్డుకట్ట వేయడం కష్టం. అయితే ఆయన 73 ఏళ్ల వయసును కూడా పరిగణలోకి తీసుకోవాలి అని కొంతమంది ఫ్యాన్స్‌ అంటున్నారు. చూడాలి తలైవా మరి ఏ నిర్ణయం తీసుకుంటారో. సన్ పిక్చర్స్ బ్యానర్‌ మీదే రజనీ కాంత్‌ – లోకేశ్‌ సినిమా ఉండబోతోంది. ‘విక్రమ్‌’, ‘లియో’ తరహాలోనే ఈ సినిమాను కూడా డిఫరెంట్‌ వీడియోతో పూర్తి స్థాయిల అనౌన్స్‌ చేయబోతున్నారట.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus