Rakesh Master: వైరల్ అవుతున్న రాకేష్ మాస్టర్ మామయ్య సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్ మరణం ఇండస్ట్రీకి చెందిన చాలామందిని ఎంతగానో బాధ పెట్టింది. రాకేష్ మాస్టర్ మామయ్య తాజాగా జరిగిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడినని యూనియస్ కొరకు రాకేష్ మాస్టర్ రేయింబవళ్లు ఎంతో కష్టపడ్డారని ఆయన కామెంట్లు చేశారు. ఏడాది క్రితం రాకేష్ మాస్టర్ ఖాళీ స్టాంప్ పేపర్ పై సంతకం చేసి యూట్యూబ్ ఛానల్ లో నాకు కూడా వాటా ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.

నేను చనిపోతే నా ఫ్యామిలీని చూసుకో అని రాకేష్ మాస్టర్ కోరారని ఆయన తెలిపారు. ఖాళీ స్టాంప్ పేపర్ లో ఎంత వాటా కావాలంటే అంత వాటా రాసుకో అని రాకేష్ మాస్టర్ కోరారని ఆయన తెలిపారు. ఈ ఆస్తిని రాకేష్ మాస్టర్ పిల్లలకు ఇస్తానని ఆయన మామయ్య పేర్కొన్నారు. నాకు ప్రేక్షకుల అభిమానం చాలని అందుకే ఈ ఆస్తి పేపర్లను చింపేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. రాకేష్ మాస్టర్ మంచితనం వల్లే ఆయనను అందరూ సపోర్ట్ చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాకేష్ మాస్టర్ (Rakesh Master) ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతూ గొప్పగా చెప్పడం గమనార్హం. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ డ్యాన్స్ నేర్పించడంతో పాటు ఆశ్రయం కల్పించారని చెప్పుకొచ్చారు. రాకేష్ మాస్టర్ తో 8 సంవత్సరాల అనుబంధం అని రాకేష్ మాస్టర్ గొప్ప మాస్టర్ అని ఆయన తెలిపారు.

రాకేష్ మాస్టర్ టాలెంట్ గురించి చాలామందికి తెలియదని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు. రాకేష్ మాస్టర్ కు మేము పెళ్లి చేశామని శేఖర్ మాస్టర్ వెల్లడించడం గమనార్హం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus