అవే నా ప్రాణాలు కాపాడాయి..ప్రముఖ సింగర్‌!

  • May 8, 2023 / 10:21 PM IST

ప్రమాదాలు మనకు తెసిలి జరగవు.. బయటపడితే మన అదృష్టం లేదా మన దురదృష్టం.. ప్రముఖ సింగర్‌ రక్షిత సురేశ్‌ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆదివారం మలేషియాలో ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె కారు డివైడర్‌ను ఢీ కొట్టడంతో కారు దెబ్బతింది. ఈ ప్రమాదంలో గాయనికి చిన్నపాటి గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ ప్రమాదం విషయాన్ని రక్షిత ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.

‘ఈరోజు పెద్ద ప్రమాదమే జరిగింది. ఉదయం మలేషియా విమానాశ్రయానికి వెళ్తుండగా నేను ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను కొట్టింది. ముందు భాగమంతా నుజ్జునుజ్జయింది. ఎయిర్‌ బ్యాగ్స్‌ నా ప్రాణాలు కాపాడాయి. అవే లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. జరిగింది తలుచుకుంటే ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది. డ్రైవర్‌, నేను, మరో ప్యాసింజర్‌ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాం. ఏది ఏమైనా చావు నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డందుకు మేము చాలా అదృష్టవంతులం.

కానీ ఆ 10 సెకన్లలో నా జీవితమంతా కళ్ల ముందు మెదిలింది’’ అని రాసుకొచ్చింది.రక్షిత సురేశ్‌.. ఇటీవల ‘పొన్నియన్‌ సెల్వన్‌2’ కన్నడ వెర్షన్‌లో ‘కిరునగే’, వీర రాజా వీర పాటలు పాడారు. రిథమ్‌ తఽథిమ్‌, లిటిల్‌ స్టార్‌ సింగర్‌ 2009 విజేతగాగా నిలిచిన ఆమె సూపర్‌ సింగర్‌ 6లో రన్నరప్‌గా నిలిచింది.

తెలుగు, తమిళ, కన్నడ భాషలతోపాటు హిందీలోనూ పాటలు పాడి తన సత్తా చాటారు.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చల్ల గాలి పాట పాడింది రక్షిత సురేశ్‌ రోడ్డు ప్రమాదం జరిగిందని అని తెలియగానే ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు, రక్షిత సురేశ్‌ ప్రమాదంపై క్లారిటీ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus