మరోసారి నెటిజెన్ల పై మండి పడ్డ రకుల్

Advertisement

పాపం రకుల్ ప్రీత్ సింగ్ టైం ఏమీ బాలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా ప్లాపులవుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది వచ్చిన ‘దేవ్’ ‘ఎన్.జి.కె’ చిత్రాలు ఘోర డిజాస్టర్లుగా మిగిలాయి. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో చేసిన ‘దె దె ప్యార్ దె’ సినిమా పర్వాలేదనిపించినా ఈమెకు పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. ఇక తెలుగులో ఈమె చేతిలో నాగార్జున తో చేస్తున్న ‘మన్మధుడు2’ అలాగే నితిన్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో రూపొందుతున్న సినిమాలు మాత్రమే ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ మంచి యాక్టివ్ గా ఉంటుంది రకుల్. అయితే ఈమధ్య ఆమె పెట్టిన ఫోటోలను తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. లక్ష్మీ మంచుతో రకుల్ దిగిన ఓ ఫోటో పై రకరకాల కామెంట్స్ చేస్తూ రకుల్ ను హేళన చేస్తున్నారు నెటిజన్లు. ఈ కామెంట్ల పై ఎట్టకేలకు రకుల్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “పని పాట లేని వారు చాలా మంది విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. అలాంటి వారు చేసే కామెంట్స్ ని నేను అస్సలు లెక్క చేయను. స్నేహితులు – నా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారనేదే నాకు ముఖ్యం. అయినా నేను ఎంతో మందికి నచ్చుతాను.. అలాగే కొంతమందికి నచ్చను. అందరినీ శాటిస్ఫై చేసే శక్తి నాకు లేదు’ అంటూ రకుల్ తనదైన శైలిలో జవాబిచ్చింది రకుల్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news