సీనియర్ హీరోని బాగానే ఇంప్రెస్ చేసినట్లుంది!

  • November 19, 2020 / 02:11 PM IST

టాలీవుడ్ లో అతి కొద్ది కాలంగా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఎంత వేగంగా కెరీర్ లో ఎదిగిందో అంతేవేగంగా తన క్రేజ్ ని పోగొట్టుకుంది. ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ లు కావడం, పైగా ఇండస్ట్రీలో పోటీ పెరగడంతో రకుల్ కి అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగులో నితిన్ పక్కన ‘చెక్’ సినిమాలో అలానే వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తోంది. ఆమెకి తెలుగులో అవకాశాలు తగ్గిన సమయంలో బాలీవుడ్ లో ఒకట్రెండు అవకాశాలు వచ్చాయి.

‘అయ్యారీ’, ‘దే దే ప్యార్ దే’ వంటి సినిమాల్లో నటించింది. ఇందులో ‘దే దే ప్యార్ దే’ పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరోతో రొమాన్స్ చేసింది రకుల్. కథకు తగ్గట్లుగా రకుల్ తన పాత్రకి బాగానే సూట్ అయింది. ఈ సినిమాలో తన అందం, నటనతో ఆకట్టుకున్న రకుల్ ఇప్పుడు మరోసారి అజయ్ దేవగన్ తో నటించబోతున్నట్లు సమాచారం. అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమాలో రకుల్ కి ఛాన్స్ ఇచ్చాడు.

గతంలో దర్శకుడిగా ‘శివాయ్’ సినిమాను రూపొందించిన అజయ్.. ఇటీవలే దర్శకుడిగా తన రెండో సినిమా ‘మే డే’ను ప్రకటించాడు. ఇందులో అజయ్ పైలట్ పాత్ర పోషించనున్నారు. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. రకుల్ కో పైలట్ గా కనిపించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఆమె సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘దే దే ప్యార్ దే’ సినిమాలో రకుల్ పెర్ఫార్మన్స్ నచ్చి అజయ్ తనకు మరో ఛాన్స్ ఇచ్చాడని టాక్. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus