Rakul Preet: వైరల్ అవుతున్న రకుల్ ప్రీత్ – మంచు లక్ష్మీ ల లేటెస్ట్ ఫోటో-షూట్ పిక్స్..!

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. అనతి కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ‘కెరటం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తరువాత సందీప్ కిషన్ తో చేసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ తో మొదటి హిట్ ను అందుకుంది. అటు తరువాత ఈమెకు ఇక్కడ వరుస ఆఫర్లు వచ్చాయి. ఇదిలా ఉండగా.. టాలీవుడ్లో ఈమెకు ఫ్రెండ్స్ కూడా ఎక్కువేనన్న సంగతి తెలిసిందే. రానా,సందీప్ కిషన్, లక్ష్మీ మంచు, సమంత,వెన్నెల కిషోర్ వంటి వారితో ఈమెకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.

రెగ్యులర్ గా వీళ్ళు మీట్ అవుతూనే ఉంటారు. ముఖ్యంగా లక్ష్మీ మంచుతో ఈమె చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. తాజాగా వీళ్ళిద్దరూ కలిసి పాల్గొన్న ఫోటో షూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో రకుల్, మంచు లక్ష్మీ లతో పాటు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అయిన నీరజ కోనా కూడా ఉండడం గమనార్హం. ఈ ఫోటో షూట్ కు కారణం ఏంటా అని ఆరా తీస్తే… ‘ఆహా’ ఓటిటి కోసం మన రానా ‘నెంబర్ వన్ యారి’ అంటూ ఓ ప్రోగ్రాంను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనికి సంబంధించిన తాజా ఎపిసోడ్ కు రకుల్, మంచి లక్ష్మీ లు గెస్ట్ లు గా హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఈ షో గతంలో జెమినీ లో టెలికాస్ట్ అయ్యేది. ఇప్పుడు నిర్వహిస్తోంది కొత్త సీజన్ అని తెలుస్తుంది. టాలీవుడ్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన వారిని ఈ షోకి గెస్టులు తీసుకొస్తున్నాడు రానా. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి నెట్టింట్లో సందడి చేస్తున్న రకుల్- లక్ష్మీ ల ఫోటోలను ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus