బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్స్ తమ సేవింగ్స్‌ను ఎక్కువగా రియల్ ఎస్టేట్, స్థలాల మీద ఇన్వెస్ట్ చేసేవాళ్లు. లేదంటే స్టూడియోలు కట్టేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోలంతా కమర్షియల్ వ్యాపారాల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో అడుగుపెడుతున్నారు. మహేష్ బాబు AMB సినిమాస్‌తో మొదలైన ఈ ట్రెండ్.. ఇప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.

Ram Charan, Jr NTR and Prabhas

తాజాగా విశాఖపట్నంలో అల్లు ఫ్యామిలీ, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 8 స్క్రీన్ల “AAA” మల్టీప్లెక్స్.. గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఈ ఈవెంట్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో వైజాగ్ వచ్చారు. అలాగే విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్‌లో, రవితేజ (ART) కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో రాణిస్తున్నారు. రాబోయే హైదరాబాద్ ఐమ్యాక్స్‌లో మహేష్, వెంకటేష్, రానా లాంటి స్టార్లు పార్ట్నర్స్ కాబోతున్నారని టాక్ ఎప్పటి నుండో ఉంది.

చిన్న థియేటర్లు మెయింటైన్ చేయడం కష్టమైపోయి మూతపడుతున్న ఈ టైమ్‌లో.. స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ రంగంలోకి రావడం ఇండస్ట్రీకి ఎంతో అవసరం. అయితే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఒకటే చర్చ నడుస్తోంది. బన్నీ, మహేష్ లాంటి స్టార్లు సక్సెస్ అవుతున్న ఈ థియేట్రికల్ బిజినెస్‌లోకి.. గ్లోబల్ స్టార్స్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? అని.

ఈ ముగ్గురు టాప్ హీరోలు చాలా రిచ్, అలాగే వారికి భారీ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్లు కూడా మల్టీప్లెక్స్ రంగంలోకి వస్తే థియేటర్ల కొరత తీరడమే కాకుండా.. చిన్న సినిమాలకు కూడా స్క్రీన్స్ దొరుకుతాయి. ఓటీటీల హవా నడుస్తున్న ఈ టైమ్‌లో, జనాలు థియేటర్లకు రావాలంటే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడిన మల్టీప్లెక్స్‌లు చాలా అవసరం. అలాంటప్పుడు రామ్ చరణ్, తారక్, ప్రభాస్ లాంటి స్టార్స్ మాత్రం ఈ ట్రెండ్‌ను ఫాలో అవ్వకపోవడం అనేది.. చాలా మందికి అంతు చిక్కని అంశంగా పరిగణించాలి.

రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus