ప్రస్తుతం ఇండియన్ సినిమాలో క్యూటెస్ట్ అందాల బాంబులు చాలా ఉన్నాయి. అందులో ఓ ఇద్దరు చాలా స్పెషల్. ఒకరు అందాల అతిలోకసుందరి శ్రీదేవి కూతురు కాగా. రెండో అమ్మాయి దేశ సినిమాలో స్టార్ అయిపోయిన తెలుగమ్మాయి శ్రీలీల. ఈ ఇద్దరూ కలసి ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఒకరిని వెండితెరపై చూస్తేనే అభిమానులు కళ్లు వెలిగిపోతాయి. అలాంటిది ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? అలాంటి బంపరాఫర్ ఇప్పుడు మొత్తం ఇండియన్ సినిమాకు కలబోతోంది.
జాన్వీ కపూర్, శ్రీలీల ఇప్పుడు ఒకే వ్యక్తితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది. ఆ ప్రేమను పొందే కుర్రాడి పరిస్థితి ఏమో కానీ.. ఆ కథను చూడటానికి ప్రేక్షకులకు పండగే. గునీత్ మోంగా, ఏక్తా కపూర్ నిర్మాణంలో రాబోతున్న ఓ సినిమా కోసం ఈ ఇద్దరి పేర్లను పరిశీలించి, దాదాపు ఓకే చేశారట. వీరిద్దరి ప్రేమను పొందే హీరో గురించే ప్రస్తుతం వెతుకులాట జరగుతోందట. ఉమేశ్ బిస్త్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. ఈ అక్టోబరు లేదా నవంబరులో సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం.
అయితే, ఆ హీరో స్టార్ హీరో అయ్యే అవకాశం తక్కువే అని ఉంటున్నారు. హీరోయిన్స్ ఓరియెంటెడ్ కథగా ఈ సినిమా ఉండబోతోంది అని చెబుతున్నారు. ఒకవేళ ఇద్దరూ అక్కచెల్లెల్లిగ కనిపిస్తే జాన్వీనే అక్క అవుతుంది అని చెప్పొచ్చు. ఇక జాన్వీ కొత్త సినిమాల సంగతి చూస్తే.. ‘లగ్ జా గాలే’ అనే సినిమాలో నటిస్తోంది జాన్వీ. ఇక శ్రీలీల సంగతి చూస్తే.. బాలీవుడ్‌లో చాలా నెలలుగా అనురాగ్ బసు సినిమాలో నటిస్తూనే ఉంది. ఇంకా ఆ సినిమా అవ్వలేదు. ఆ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరో.
మరోవైపు తమిళంలో ధనుష్‌తో ‘ఓమ్’ సినిమాలో నటిస్తోంది. ఇది కాకుండా ఆమె చేతిలో మరో సినిమా లేదు. కాబట్టి ఈ ఇద్దరి నెక్స్ట్ సినిమా ఆ లవ్ స్టోరీనే అని చెబుతున్నారు.