Ram Charan, Shankar: శంకర్‌ సినిమా సెట్స్‌పై ఉండగానే స్టార్ట్‌ చేస్తారా!

Advertisement

‘ఆర్ఆర్‌ఆర్‌’ తర్వాత చేసే సినిమాలు పాన్‌ ఇండియా సినిమాలే అవ్వాలని రామ్‌చరణ్‌ కోరుకుంటున్నారా? ఆయన మనసులో ఏముందో కానీ, అతని నుండి మొదలవుతున్న సినిమాలు మాత్రమే అలానే ఉన్నాయి. శంకర్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా పాన్‌ ఇండియా అని తెలిసిందే. ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా పాన్‌ ఇండియా రేంజిదే అంటున్నారు. అంతేకాదు ఆ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చరణ్‌ అనుకుంటున్నారట.

Click Here To Watch Now

రామ్‌చరణ్‌ – యూవీ క్రియేషన్స్‌ కాంబినేషన్‌లో సినిమా అంటూ చాలా రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అయితే సరైన కథ, దర్శకుడు దొరక్క ప్రాజెక్ట్‌ మెటీరియలైజ్‌ అవ్వడం లేదు. ఎట్టకేలకు గౌతమ్‌ తిన్ననూరి రూపంలో దర్శకుడు, స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో మంచి కథ కుదిరాయి. కథ విషయంలో చిత్రబృందం నుండి అధికారిక సమాచారం లేనప్పటికీ… ఈ కథలో రామ్‌ చరణ్‌ ఫుట్‌బాలర్‌గా కనిపిస్తాడని మాత్రం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాను జులైలో ప్రారంభించాలని చిత్రబృందం అనుకుంటోందట.

అందుకుతగ్గట్టుగా గౌతమ్‌ తిన్ననూరి బృందం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు స్టార్ట్‌ చేసిందిట. మరోవైపు గౌతమ్‌ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులుదిద్దే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం. విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు దర్శకుడు గౌతమ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆ కథాంశంలో స్పోర్ట్స్‌ టచ్‌ ఉంటుందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. సినిమా ముహూర్తం, షూటింగ్‌ వెంటవెంటనే స్టార్ట్‌ అని కూడా టాక్‌ నడుస్తోంది. ఇక శంకర్‌ సినిమాకు సంబంధించి ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి.

రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ కూడా జరిపారు. ఇదిలా ఉండగా చరణ్‌ త్వరలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రచారం షురూ చేస్తాడు. ఆ పని అయ్యాక ‘ఆచార్య’ ప్రచారం పనులు మొదలుపెడతారు. కాబట్టి చరణ్‌ మరో నెలన్నర రోజులు ప్రచారంతో బిజీ. ఆ తర్వాత సినిమా షూటింగ్‌లు మొదలవుతాయి. శంకర్‌ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ అంటున్నారు. గౌతమ్‌ ప్రాజెక్ట్‌ అయితే సమ్మర్‌కి అని అంటున్నారు. సో చరణ్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news