Ram Charan, Rajamouli: రాజమౌళిపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ వైరల్!

  • December 3, 2022 / 04:46 PM IST

రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రెండు సినిమాలు తెరకెక్కగా మగధీర, ఆర్.ఆర్.ఆర్ ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా చరణ్ రేంజ్ ను పెంచడంలో జక్కన్న పాత్ర ఎంతో ఉంది. పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న జక్కన్నకు ఆస్కార్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఊహలను తన విజన్ తో అద్భుతమైన సన్నివేశాలతో తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్న రాజమౌళికి ఆస్కార్ రావాలని చరణ్ ఆకాంక్షించారు.

ఎన్డీటీవీ సంస్థ నుంచి ట్రూ లెజెండ్ అవార్డ్ ను అందుకున్న చరణ్ ఆస్కార్ బరిలో తాను, తారక్ కలిసి నటించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ కూడా ఉండటం సంతోషాన్ని కలిగిస్తోందని చరణ్ తెలిపారు. ఆస్కార్ కు రాజమౌళి అర్హుడని చరణ్ పేర్కొన్నారు. తాను మనస్పూర్తిగా రాజమౌళికి ఈ అవార్డ్ రావాలని కోరుకుంటున్నానని చరణ్ అన్నారు. మరోవైపు చరణ్ కు అవార్డ్ రావడం విషయంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

రాబోయే రోజుల్లో రామ్ చరణ్ కు మరెన్నో అవార్డులు సొంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ విషయంలో చరణ్ ఒకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ సినిమా బడ్జెట్ కు అనుగుణంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో చరణ్ నటిస్తుండగా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా నిమిషాల్లో నెట్టింట వైరల్ అవుతోంది.

త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్ డేట్ రానుందని సమాచారం అందుతోంది. చరణ్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరో సినిమా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus